Mamata banerjee: ప్రధాని మోడీకి సీఎం మమత లేఖ.. ఏం డిమాండ్ చేశారంటే..!
- ప్రధాని మోడీకి సీఎం మమత లేఖ
- అత్యాచార ఘటనలపై లేఖ
- కఠిన చట్టాలు తీసుకురావాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన యావత్తు దేశాన్ని కుదిపేస్తున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా రోజు 90 అత్యాచారాలు జరుగుతున్నాయని.. వీటిని అరికట్టడానికి కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రధాని మోడీని లేఖలో కోరారు. కఠినమైన చట్టాలతోనే అత్యాచారాలకు అడ్డుకట్ట వేయగలమని లేఖలో మమత పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: అన్నమయ్య జిల్లాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. షెడ్యూల్ ఇదే..
Also Read
దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను మీ దృష్టికి తీసుకువస్తున్నట్లు మమత తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు రోజుకు 90 అత్యాచారాలు జరుగుతున్నాయని.. ఈ పరిస్థితి భయాందోళనలు కలుగజేస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు సమాజం విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. తగిన శిక్షలు విధించేలా కఠినమైన చట్టం తీసుకురావాలని కోరారు. సున్నితమైన ఈ సమస్యను సమగ్ర పద్ధతిలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని.. సత్వర న్యాయం జరగాలంటే కేసుల విచారణ 15 రోజుల్లో పూర్తి చేయాలని మమత లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Tollywood: మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాల అప్ డేట్స్.. జస్ట్ వన్ క్లిక్ తోనే..
వైద్యురాలి హత్యాచార కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కోల్‌కతా హైకోర్టు ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టారు. అయితే రంగంలోకి దిగకముందే క్రైమ్ సీన్ ఆనవాళ్లు చెరిపేసినట్లుగా గుర్తించారు. దీంతో దర్యాప్తు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి అండ్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సహా ఈ కేసుతో సంబంధమున్న మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ టెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. సీబీఐ చేసిన విజ్ఞప్తిని కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతి లభించింది.
సీబీఐ విచారణలో సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని సమాచారం. ఇక ఘటన తర్వాత.. సందీప్ ఘోషే.. బాధిత కుటుంబానికి తప్పుడు సమాచారం ఇప్పించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఒక ప్రణాళిక ప్రకారం క్రైమ్ ఆఫ్ సీన్ కూడా మార్చేసినట్లుగా సీబీఐ అభిప్రాయపడుతుంది. సందీప్ ఘోష్‌తో సహా మరో నలుగురు వైద్యులు ఆయనతోనే ఉన్నట్లుగా సీబీఐ భావించింది. మరింత సమాచారం రాబట్టడం కోసం పాలిగ్రాఫ్ టెస్టుకు రెడీ అయింది. దీంతో కీలక సమాచారాన్ని సీబీఐ రాబట్టనుంది.
ఇక వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం నిరసన చేస్తున్న డాక్టర్లకు సూచించింది. మరోవైపు ఆర్జీ కర్ ఆస్పత్రి దగ్గర కేంద్ర భద్రతా బలగాలు మోహరించాయి. గురువారం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై మండిపడింది. తీవ్రంగా ధ్వజమెత్తింది. అంతేకాకుండా బాధితురాలు దహన సంస్కారాలు పూర్తయ్యాక కేసు నమోదు చేయడంపై కూడా పోలీస్ యంత్రాంగంపై మండిపడింది. ఇదిలా ఉంటే న్యాయం కోసం దేశ వ్యాప్తంగా మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
I have written this letter today to the Hon'ble Prime Minister of India: pic.twitter.com/pyVIiiV1mn
— Mamata Banerjee (@MamataOfficial) August 22, 2024
తాజావార్తలు
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!