Mallikarjun Kharge: బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి కారణమయ్యాయి. ఖర్గే ప్రసంగిస్తుండగా, ఓ యువకుడు ‘‘మోడీ వెళ్లరు’’ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా ‘‘మోడీ తండ్రి కూడా వెళ్లిపోతారు’’ అని వ్యాఖ్యానించారు. ఖర్గే ప్రసంగం చేస్తున్న సమయంలో గుంపులో ఉన్న ఒక యువకుడు ప్రధాని మోడీ అధికారంలోనే ఉంటారని వ్యాఖ్యానించడంతో ఖర్గే ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే ప్రసంగానికి అంతరాయం కలిగిచిన ఆ యువకుడిని కాంగ్రెస్ కార్యకర్తలు చితకబాదారు.
ఖర్గే ప్రధాని మోడీతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలమే శాంతికి భంగం కలిగిస్తోందని ఆరోపించారు. స్వాతంత్య్రం తర్వాత కూడా ఆర్ఎస్ఎస్, ఇతర శక్తులు అల్లర్లను ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియపై ఖర్గే విమర్శలు చేశారు. ఎస్ఐఆర్ ద్వారా ఓటర్లను తీసేస్తున్నారని ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, కేంద్ర ప్రభుత్వం మధ్య కుమ్మక్కు ఉందని కూడా ఆయన ఆరోపించారు.
తన రాజకీయ ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ.. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి స్థాయి నుంచి ఏఐసీసీ అధ్యక్షుడి వరకు ఎదిగానని చెప్పారు. తనకు 85 ఏళ్లు అని పేర్కొంటూ, బెదిరింపులకు భయపడబోనని వ్యాఖ్యానించారు. తన కుమారుడిని కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, దీనిపై బీజేపీ స్పందిస్తూ.. కాంగ్రెస్ అసహనం ఖర్గే మాటల్లో వ్యక్తమవుతుందని ప్రతివిమర్శలు చేసింది.
#WATCH | A ruckus broke out during Congress national president Mallikarjun Kharge’s address at the 139th birth anniversary celebration of Dr. Shri Krishna Singh in Patna, Bihar
A person present at the event said that PM Modi would not go anywhere, Kharge responded, "Modi ka baap bhi jayega."
— ANI (@ANI) October 25, 2026

