Allahabad High Court: “ఎప్పుడూ మగవారిదే తప్పు కాదు”.. రేప్ కేసులో సంచలన తీర్పు..
- అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు..
- నిందితుడిని నిర్దోషిగా విడుదల..
- ప్రతీసారి "మగవారిదే" తప్పు కాదంటూ వ్యాఖ్యలు..
- ఇద్దరిది తప్పే
- ఎవరిని ఎవరు మోసం చేశారో చెప్పడం కష్టం.. ఇద్దరు కలిసి ఆనందించారంటూ ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allahabad High Court: పెళ్లి పేరుతో ఓ మహిళపై అత్యాచారం చేశాడని అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది అలహాబాద్ హైకోర్టు. తీర్పు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక నేరాలకు సంబంధించి చట్టం సరైనదేనని, అయితే ప్రతీసారి మగవారిదే తప్పు అని అర్థం కాదని పేర్కొంది. న్యాయమూర్తులు రాహుల్ చతుర్వేది, జస్టిస్ నంద్ ప్రభా శుక్లాతో కూడిన డివిజనల్ బెంజ్, ఈ వ్యవహారంలో ఇద్దరి తప్పు ఉందని పేర్కొంది.
‘‘నిస్సందేహంగా, చాప్టర్ XVI (ఆన్) ‘లైంగిక నేరాలు’ అనేది ఒక మహిళ మరియు అమ్మాయి యొక్క గౌరవం మరియు గౌరవాన్ని కాపాడటానికి స్త్రీ-కేంద్రీకృత చట్టం,కానీ పరిస్థితులను అంచనా వేసేటప్పుడు, ఇది పురుషుడు తప్పుమాత్రమే కాదని, భాగస్వామి తప్పు కూడా ఉంది, ఇద్దరి తప్పు ఉంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
అత్యాచారం కేసులో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఫిర్యాదుదారు చేసిన అప్పీల్‌ని కోర్టు విచారించింది నిందితుడిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989 కింద ఛార్జిషీట్ దాఖలైంది. 2019లో నిందితుడు పెళ్లి చేసుకుంటానని తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, అయితే ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని సదరు మహిళ ప్రయాగ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కులం గురించి కించపరిచేలా మాట్లాడాడని ఆమె పేర్కొంది. విచారణ అనంతరం 2020లో నిందితుడిపై ఛార్జిషీట్ దాఖలైంది.
Read Also: Jayam : 22 ఏళ్లు పూర్తి చేసుకున్న నితిన్ క్లాసిక్ మూవీ..
ప్రయాగ్‌రాజ్‌లోని ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 8, 2024న అత్యాచారం అభియోగం కింది నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. కేవలం ఐపీసీ సెక్షన్ 323 కింద గాయపరడం అభియోగం కింద అతడిని దోషిగా నిర్ధారించింది. దీంతో మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసును విచారించిన కోర్టు, ఇద్దరి మధ్య సంబంధం ఏకాభిప్రాయంతో కుదిరినట్లు గుర్తించింది. మహిళది యాదవ కులం కాదని తెలిసిన తర్వాత అతను ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. సదరు మహిళ 2010లో ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న విషయాన్ని కూడా దాచిపెట్టినట్లు, భర్తకు రెండేళ్లుగా దూరంగా ఉన్నట్లు కోర్టు గుర్తించింది.
ట్రయల్ కోర్టు సదరు వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించడాన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. పెళ్లై, అంతకుముందు వివాహాన్ని రద్దు చేసుకోకుండా, కులాన్ని దాచిపెట్టి మహిళ ఎలాంటి అభ్యంతరం లేకుండా ఐదేళ్ల పాటు శారీరక సంబంధాన్ని కొనసాగించిన విసయాన్ని తేలికగా ఊహించవద్దని కోర్టు పేర్కొంది. ఇద్దరూ అలహాబాద్, లక్నోలని అనేక హోటళ్లు, లాడ్జీల వెంట తిరిగి ఆనందించారు, ఎవరిని ఎవరు మోసం చేశారనేది నిర్ధారించడం కష్టమని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో, లైంగిక వేధింపులు, అత్యాచారానికి గురైనట్లు బాధితురాలి వాదనలను అంగీకరించలేమని, ట్రయల్ కోర్టు నిందితులను నిర్దోషిగా విడుదల చేసిందని కోర్టు నిర్ధారించింది.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!