NTV Telugu Site icon

PM Modi: దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Modi

Modi

PM Modi: భారతదేశ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ప్రజలంతా పాడి పంటలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతో పాటు, రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి రావాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాని పేర్కొన్నారు. సంక్రాంతి మన సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయంలోనూ అంతర్భాగమైనదని ప్రధాని మోడీ అన్నారు.

Read Also: Clashes in Cockfighting: కోడి పందాల్లో ఉద్రిక్తత.. బీరు సీసాలతో వీరంగం.. పగిలిన తలలు..

ఇక, సంక్రాంతి పండగని పురస్కరించుకొని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఇంట్లో సోమవారం నాడు నిర్వహించిన వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రధానికి కిషన్‌రెడ్డి దంపతులు, సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మతో పాటు పలువురు నేతలు స్వాగతం పలికారు. ఆ తర్వాత వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా తులసికోటకు మోడీ పూజలు నిర్వహించిన తర్వాత భోగి మంటలను వెలిగించారు. గంగిరెద్దులకు ఆహారం అందించి వాటిని ఆడించేవారికి సంప్రదాయ వస్త్రాలను అందజేశారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో ప్రధాని మోడీ షేర్ చేశారు.

Show comments