Site icon NTV Telugu

Mahua Moitra: లంచం తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారు.. టీఎంసీ ఎంపీపై బీజేపీ ఎంపీ ఆరోపణలు..

Mahua Moitra

Mahua Moitra

Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి ఆమె ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

పార్లమెంట్ లో ప్రశ్నలు అడగేందుంకు ఎంపీకి, సదరు వ్యాపారవేత్తకు మధ్య లంచాలు మారాయని, డబ్బులు, గిఫ్టుల రూపంలో లంచాలు తీసుకున్నారని బీజేపీ ఎంపీ దూబే ఆరోపించారు. మహువా మొయిత్రాను వెంటనే సభ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ని కోరాడు.

పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడల్లా మహువా మొయిత్రాతో పాటు టీఎంసీ ఎంపీలకు సభకు అడ్డుతగలడం అలవాటుగా మారిందని, ప్రతీ ఒక్కరిపై ఏదో సాకుతో సభను నిరంతరం దుర్వినియోగం చేస్తున్నారని, ఆమె ఇటీవల కాలంలో లోక్‌సభలో అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు అదానీ గ్రూపు పై ఉన్నాయని.. ఈ వ్యాపార గ్రూపు పైనే అక్రమాలు జరిగాయని ఆమె తరుచుగా ఆరోపించారని దూబే స్పీకర్ కి రాసిన రెండు పేజల లేఖలో పేర్కొన్నారు.

Read Also: ENG vs AFG: వరల్డ్ కప్‌లో సంచలనం.. ఇంగ్లాండ్‌పై అఫ్గానిస్తాన్‌ ఘన విజయం

తృణమూల్ కాంగ్రెస్ నేతల వ్యూహాలు సామాన్య ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు, ఇతర సభ్యుల రాజ్యాంగ హక్కుల్ని హరిస్తున్నాయిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. ‘క్విడ్ ప్రోకో’ విధానంలో ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుని మరో వ్యాపార గ్రూపుని లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ ఎంపీ ఆరోపించారు. మహువా మొయిత్రా ఫైర్ బ్రాండ్ ఎంపీ అనే బిరుడు బూటకం తప్ప మరేమి కాదని విమర్శించారు.

దూబే వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా… తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలనైనా స్వాగతిస్తానని అన్నారు. నకిలీ డిగ్రీవాలా, ఇతర బీజేపీ ప్రముఖులపై అధికార ఉల్లంఘనలు పెండింగ్ లో ఉన్నాయని, స్పీకర్ వాటిని పరిష్కరించిన వెంటనే నాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే స్వాగతిస్తానని, నా గుమ్మం ముందుకు వచ్చే ముందు ఈడీ, ఇతర ఏజెన్సీలు అదానీ బొగ్గు కుంభకోణంపై ఎఫ్ఐార్ నమోదు చేయాలని ఆమె అన్నారు. మహువా మోయిత్రా ప్రస్తుతం బెంగాల్ లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Exit mobile version