NTV Telugu Site icon

Maharashtra: ఈ వారం నుంచే అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ ఎన్నిక ఎప్పుడంటే..!

Mahacm

Mahacm

మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేశారు. ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశాక.. తొలి సంతకం ఒక పేషెంట్‌కు ఆర్థిక సాయంపై చేశారు. పూణెకు చెందిన రోగి చంద్రకాంత్ శంకర్ కుర్హాడేకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5లక్షల సాయం అందించే ఫైల్‌పై ఫడ్నవిస్ తొలి సంతకం చేశారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ఫ్లాంట్(ఎముక మజ్జ మార్పిడి చికిత్స) కోసం రూ.5 లక్షల సాయం చేసి మానవత్వం చాటుకున్నారు.

ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం పాత్రలు మాత్రమే మారాయని.. అభివృద్ధి మాత్రం ఎక్కడా ఆగదని తెలిపారు. ముగ్గురం కలిసే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలోని మంత్రుల పనితీరును బట్టి మంత్రులను ఎంపిక చేస్తామన్నారు. ఇక డిసెంబర్‌ 7 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రొట్రెం స్పీకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఉంటుందన్నారు. అనంతరం డిసెంబర్ 9న స్పీకర్‌ ఎన్నిక చేపడతామని పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో మహారాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశామని.. ఇప్పుడూ అలాగే కృషిచేస్తామన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన మేరకు హామీలు పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరిగిందని తాను భావించడంలేదన్నారు. 2004లో కూడా 12 -13 రోజుల పాటు ఆలస్యం జరిగిందని.. 2009లో కూడా తొమ్మిది రోజులు ఆలస్యమైందని గుర్తుచేశారు. తాజాగా ఫలితాలు వచ్చిన 12 రోజులకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది.

 

 

Show comments