మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలో.. ఆ రాష్ట్రంలోని ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది.. అందులో భాగంగా మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా ఆలయాన్ని కూడా మూసివేశారు.. తర్వాతి ఉత్తర్వులు వెలువడేంతవరకూ ఆలయాన్ని మూసే ఉంచనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు ఏప్రిల్ 5వ తేదీన ప్రకటించారు.. అయితే, కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ వరుసగా ఆలయాలు తెరుచుకుంటున్నాయి.. ఈ నేపథ్యంలో.. షిర్డీ సాయినాథుని ఆలయాన్ని తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.. అక్టోబర్ 7వ తేదీ నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది.. నవరాత్రి మొదటి రోజు నుండి, అంటే అక్టోబర్ 7వ తేదీ నుండి కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తుల కోసం రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా స్థలాలను తెరవాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.