Maharashtra Polls: 65 మందితో తొలి జాబితా విడుదల చేసిన ఉద్ధవ్ థాకరే
- 65 మందితో తొలి జాబితా విడుదల చేసిన ఉద్ధవ్ థాకరే
- 15 మంది పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 14 మందికి తిరిగి టిక్కెట్
- ఓర్లి నుంచి ఆదిత్య థాకరే పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో పొత్తు చర్చలు సఫలీకృతం అయ్యాయి. సీట్ల షేరింగ్‌పై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చాయి. మూడు పార్టీలు కూడా రాష్ట్రంలోని 288 సీట్లకు గానూ ఒక్కో పార్టీ 85 స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించారు. మూడు పార్టీలు మొత్తం 255 సీట్లలో పోటీ చేయగా.. మిగిలిన 33 సీట్లలో కూటమిలోని చిన్న మిత్రపక్షాలకు కేటాయించారు.
ఇక మహా వికాస్ అఘాడి (MVA)లో కీలక భాగస్వామ్య పార్టీ అయిన ఉద్ధవ్ థాకరే శివసేన 65 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం ప్రకటించింది. ఇందులో 15 మంది పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 14 మందికి తిరిగి టిక్కెట్ ఇచ్చింది. ఆదిత్య థాకరే, రాజన్ విచారే ఇందులో ఉన్నారు. పార్లమెంటు మాజీ సభ్యుడైన రాజన్ విచారే.. థానే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
అభ్యర్థులు వీళ్లే..
తాజాగా పార్టీ టిక్కెట్లు ప్రకటించిన ప్రముఖుల్లో ఆదిత్య థాకరే (ఓర్లి), సునీల్ ప్రభు (దిన్దోషి), సంజయ్ పొట్నిస్ (కలిన), ప్రకాష్ ఫతర్పేకర్ (చెంబూరు), రమేష్ కోర్కావోంకర్ (భందుప్ వెస్ట్), సునీల్ రౌట్ (విక్రోలి), రతజు లట్కే (అంథేరి ఈస్ట్), వైభవ్ నికే (కుడల్), రాజన్ సాల్వి (రాజపూర్), భాస్కర్ జాదవ్ (గుహాగర్), కైలాస్ పాటిల్ (ఒస్మానాబాద్), రాహుల్ పాటిల్ (పర్బని), నితిన్ దేశ్‌ముఖ్ (బాలాపూర్), ఉదయ్‌సింగ్ రాజ్పుట్ (కన్నాడ్) ఉన్నారు. తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే అజయ్ చౌదరి (షివడి నియోజకవర్గం)కి చోటు దక్కలేదు. 288 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!