Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Maharashtra Political Crisis Fadnavis Meets Governor Request For Floor Test

Maharashtra Political Crisis: గవర్నర్ ను కలిసిన ఫడ్నవీస్.. ఫ్లోర్ టెస్ట్ కోసం అభ్యర్థన

Published Date :June 29, 2022 , 7:45 am
By Venu Goapl Reddy
Maharashtra Political Crisis: గవర్నర్ ను కలిసిన ఫడ్నవీస్.. ఫ్లోర్ టెస్ట్ కోసం అభ్యర్థన
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నామని చెబుతున్నారు. వీరంతా శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో గౌహతిలో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత, మాజీ సీఏం దేవేంద్ర ఫడ్నవీస్, రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే రహస్యంగా సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని.. మీ మనోభావాలను గౌరవిస్తానని సీఎం ఉద్ధవ్ ఠాక్రే, రెబెల్ ఎమ్మెల్యేలను కోరుతున్నారు.

ఈ సమయంలో మంగళవారం ఢిల్లీలో బీజేపీ ప్రముఖలతో చర్చల అనంతరం ముంబై వచ్చిన ఫడ్నవీస్ నేరుగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిశారు. 39 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారని.. శివసేన ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని.. బలాన్ని నిరూపించుకునేందుకు ఫ్లోర్ టెస్ట్ కు ఆదేశాలు ఇవ్వాలని ఫడ్నవీస్, గవర్నర్ ను కోరారు. ఫ్లోర్ టెస్ట్ నిర్వహించేలా గవర్నర్ కు లేఖ ఇచ్చినట్లు దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.

Also Read

  • Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
  • Oil Crisis: భారత్‌కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
  • E85 Petrol: పెట్రోల్‌లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
  • Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!

ఫడ్నవీస్, గవర్నర్ ను కలిసిన తర్వాత అటు గౌహతిలో రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. మరోవైపు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ తో పాటు ప్రవీణ్ దరికర్ లు ఫడ్నవీస్ తో చర్చలు జరిపారు. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో 144 మ్యాజిక్ ఫిగర్. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు కలిపి 152 ఎమ్మెల్యేల మెజారిటీ ఉండేది. అయితే ఇప్పుడు 39 మంది శివసేన ఎమ్మెల్యేలతో పాటు 7 మంది స్వతంత్రులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. 106 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ, శివసేన రెబెల్ ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Uddhav Thackeray
  • Devendra Fadnavis
  • eknath shinde
  • Governor Bhagat Singh Koshyari
  • Maharashtra political crisis

తాజావార్తలు

  • Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?

  • Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!

  • Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..

  • Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్‌పై బీసీసీఐ కఠిన చర్యలు.?

  • Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!

ట్రెండింగ్‌

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions