Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..
- టెంపోను ఢీకొట్టిన కంటైనర్ ట్రక్కు..
- పెళ్లికి వెళ్తున్న 13 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర పెళ్లివేడుక విషాదంగా మారింది. పెళ్లి అతిథులతో వెళ్తున్న టెంపోను ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 13 మంది మరణించారు. 25 మందికి పైగా గాయపడ్డారు. పాల్ఘర్ జిల్లాలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దహాను ప్రాంతంలోని బాపుగావ్ నుంచి ధనివారి గ్రామంలో జరిగే నిశ్చితార్థ వేడుకకు 40 మందికి పైగా ప్రయాణికులు టెంపోలో వెళ్తున్నారు. అయితే, ఒక కిలోమీటర్ డైవర్షన్ తప్పించుకోవడానికి టెంపో డ్రైవర్ రాంగ్ రూట్లో వాహనాన్ని నడిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే ప్రమాదానికి కారణమైనట్లు అధికారులు చెబుతున్నారు.
ఇలా వెళ్లే క్రమంలో గుజరాత్ నుంచి ముంబై వస్తున్న కంటైనర్ ట్రక్ ఒక్కసారిగా అదుపు తప్పి టెంపోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక బైక్ కూడా ప్రమాదానికి గురైంది. ఇలా ఢీకొట్టిన తర్వాత కంటైనర్ టెంపోపై పడిపోవడంతో ప్రయాణికులు లోపలే చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కాసా సబ్ డిస్ట్రిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 11 మంది మరణించారు. మరో ఇద్దరు దహానులోని వేదాంత ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
తాజావార్తలు
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!