Doctor Suicide: మహారాష్ట్ర సతారాలో వైద్యురాలి ఆత్మహత్య ఘటన దేశంలో సంచలనంగా మారింది. 26 ఏళ్ల లేడీ డాక్టర్ తన మరణానికి కారణం ఓ ఎస్సై అని పేర్కొంటూ, తన చేతిపై సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకుంది. ఫల్తాన్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్య అధికారిగా ఉన్న వైద్యురాలు, గురువారం రాత్రి ఉరి వేసుకుని మరణించింది. ఎస్ఐ గోపాల్ బద్నే తనపై 5 నెలల్లో నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆయనతో పాటు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనను మానసికంగా వేధించినట్లు ఆరోపించింది. లేడీ డాక్టర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ తండ్రికి చెందిన ప్లాట్‌లోనే అద్దెకు ఉంటోంది.
ఈ ఘటనలో ఎస్ఐ గోపాల్ బద్నేని మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బాధితురాలి తండ్రి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరారు. నేరస్తుడికి మరణశిక్ష విధించాలని కోరారు. నా కుమార్తెకు జరిగిన దారుణం మరో ఆడపిల్లకు రావద్దని, దోషులకు ఖచ్చితంగా మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ‘‘అన్యాయం జరుగుతుండగా అందరూ నిలబడి చూశారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అక్కడ ఉన్నారు, కానీ నా కుమార్తెను కాపాడటానికి ఒక్క కృష్ణుడు రాలేదు. భవిష్యత్తులో ఆడపిల్లల కోసం ఒక కృష్ణుడు ముందుకు వచ్చి ఆమె గౌరవాన్ని కాపాడాలి’’ అని మహాభారత ఘట్టాన్ని ఉదహరితస్తూ మాట్లాడారు.
Read Also: School Girls: యూనిఫాంలో వచ్చి, దర్జాగా “మందు” కొన్న స్కూల్ అమ్మాయిలు,
ఈ కేసులో దోషుల్ని వదలబోమని సీఎం ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. ‘‘ఆత్మహత్య చేసుకుని మరణించిన డాక్టర్ ఆమె చేతిపై అలాంటి లేఖ రాయడం ఆమె అనుభవించిన బాధను చూపిస్తుంది. నిన్న, మేము సంబంధిత అధికారిని సస్పెండ్ చేసాము. మేము దర్యాప్తు ప్రారంభించాము మరియు ఎవరూ వదిలిపెట్టబోము. ప్రతిపక్షం దీనిని రాజకీయం చేస్తోంది. ఎవరైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొన్నప్పటికీ, వారిని వదిలిపెట్టబోము’’ అని అననారు.
నాలుగు పేజీల సూసైడ్ లెటర్‌లో వైద్యురాలు సంచలన విషయాలు వెల్లడించింది. క్రిమినల్ కేసుల్లో నిందితులకు నకిలీ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు జారీ చేయమని పోలీస్ అధికారులు, ఒక ఎంపీ తనపై ఒత్తిడి తీసుకువచ్చారని, తాను నిరాకరించినప్పుడు వేధింపులకు పాల్పడినట్లు ఆమె చెప్పింది. ఈ కేసులో ప్రశాంత్ బంకర్‌ను పూణేలో అరెస్ట్ చేశారు. ఎస్ ఐ గోపాల్ బద్నేను ఇంకా అరెస్ట్ చేయలేదు.
