Doctor Suicide: మహారాష్ట్ర సతారాలో వైద్యురాలి ఆత్మహత్య ఘటన దేశంలో సంచలనంగా మారింది. 26 ఏళ్ల లేడీ డాక్టర్ తన మరణానికి కారణం ఓ ఎస్సై అని పేర్కొంటూ, తన చేతిపై సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకుంది. ఫల్తాన్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్య అధికారిగా ఉన్న వైద్యురాలు, గురువారం రాత్రి ఉరి వేసుకుని మరణించింది. ఎస్ఐ గోపాల్ బద్నే తనపై 5 నెలల్లో నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది.