Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో నిన్న ఒక్కరోజే 3.5 కోట్ల మంది భక్తులు!
- ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళా..
- ఒక్కరోజు త్రివేణి సంగమానికి తరలివచ్చిన 3.5 కోట్ల మంది భక్తులు..
- బ్రహ్మ ముహూర్తంలో భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు తెలిపిన యూపీ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela 2025: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. నిన్న (జనవరి 14) మకర సంక్రాంతి పండగను పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్నానాలు చేయగా.. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు స్టార్ట్ అయ్యాయి. ఒక్కరోజే సుమారు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
Read Also: BCCI: ఇకపై అలా ఆడకపోతే ఆటగాళ్ల పేమెంట్స్‌లో భారీగా కోత పడనుందా?
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
అయితే, కుంభమేళా సమయంలో అమృత్ స్నాన్‌కు ప్రత్యేకమైన స్థానముంది. దీంతో భారీ సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలి వచ్చి పుణ్య స్నానాలు చేశారు. వాళ్లు కేవలం కుంభమేళా సమయంలోనే వస్తుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ఒంటినిండా భస్మాన్ని పూసుకుని ఈటెలు, త్రిశూలాలు, డమరుక నాదాలను చేతిలో పట్టుకుని వేల మంది నాగ సాధువులు ఊరేగింపుగా పుణ్యస్నానాలకు బయలుదేరి వచ్చారు. మొదట పంచాయతీ అఖాడా మహానిర్వాణీ, శంభు పంచాయతీ అటల్ అఖాడాకు చెందిన సాధువులు అమృత్ స్నాన్‌లు చేయగా.. మరోవైపు, హెలికాప్టర్ల ద్వారా భక్తులపై యూపీ సర్కార్ పూల వర్షం కురిపించింది.
Read Also: Flexi Politics: ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, కేసీఆర్, బాలయ్య.. కొత్త రాజకీయ చర్చ..!
ఇక, మకర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించిన సాధువులు, భక్తులకు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపారు. అలాగే, ఈ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. అయితే, మహా కుంభమేళా ఏర్పాట్లపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్తున్న మాటలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయన్నారు. తాగునీరు, ఆహారం, వసతి లాంటి కనీస సౌకర్యాల కోసం భక్తులు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!