Physical assault on a minor girl.. Bulldoze House Of Accused: మధ్యప్రదేశ్ రాష్ట్రంతో ఇటీవల ఓ కామాంధుడు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారాని పాల్పడ్డాడు. రాష్ట్రంలోని మొరేనా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఈ ఘటనలకు పాల్పడిన గిర్రాజ్ రజాక్ అనే 35 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ అత్యాచారంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. దీంతో అధికారులు కూడా నిందితుడు రజాక్ పై చర్యలు చేట్టారు.
అత్యాచారానికి పాల్పడిన నిందితుడి ఇంటిని అధికారులు బుధవారం కూల్చేశారు. బాన్మోర్ పట్టణంలోని స్థానిక పౌర అధికారులు చట్టవిరుద్ధంగా ఉన్న నిందితుడి ఇంటిని కూల్చేశారు. మంగళవారం సాయంత్రం బాన్మోర్ పట్టణంలో ఈ ఘటన జరిగిన తర్వాత నిందితుడని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ రాయ్ సింగ్ నర్వారియా తెలిపారు. బాలిక బయట కూర్చున్న సమయంలో నిందితుడు బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే బాలిక ఏడుపులు విన్న తల్లి.. అక్కడికి చేరుకున్న సమయంలో నిందితుడు పారిపోయాడు. ఆ తరువాత నిందితుడిని కొంత దూరం వెంబడించినా దొరకలేదు.
Read Also: Uttar Pradesh: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి వైరల్ చేస్తామని బెదిరింపు
ఈ ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. చర్యల్లో భాగంగా స్థానిక మున్సిపల్ అధికారులు నిందితుడి అక్రమ నిర్మాణాన్ని కూల్చేశారు. బాలికను గ్వాలియర్ లోని ఆస్పత్రిలో చేర్చి అక్కడే చికిత్స అందిస్తున్నారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు.
నిందితుడు రాతి క్వారీలో కూలిగా పనిచేసేవాడని పోలీసులు వెల్లడించారు. అతనికి వివాహం అయి ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలపారు. గతేడాది కూడా నిందితుడు ఇలాంటి నేరానికే పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడు రజాక్ ఇళ్లు పూర్తిగా చట్టవిరుద్ధంగా నిర్మించారని.. అందుకే ఇంటిని నేలమట్టం చేశామని మున్సిపల్ అధికారి యస్వర్ గోయల్ వెల్లడించారు. సెప్టెంబర్ 8న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో మూడున్నరేళ్ల నర్సరీ చదువుతున్న బాలికపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన కొన్ని రోజులకే మొరేనాలో మరో ఘటన జరిగింది.