Man invests Rs 49 on online gaming app, wins Rs 1.5 crore: ఆవగింజంత అదృష్టం ఉంటే చాలు నూటోడు కూడా కోటోడు కావచ్చు. అందుకు మధ్యప్రదేశ్ యువకుడే ఉదాహరణ. రాత్రికి రాత్రే కోట్లు గెలుచుకున్నాడు. దీంతో తన కొత్త ఇంటి కలను నెరవేర్చుకోబోతున్నాడు ఆ యువకుడు. ఓ ఆన్ లైన్ గేమింగ్ యాప్ లో రూ. 49 పెట్టుబడి పెట్టాడు. ఓవర్ నైట్ లో రూ. 1.5 కోట్లను గెలుచుకున్నాడు షహబుద్దీన్ అనే యువకుడు.
Read Also: Mohanlal: మోహన్‌లాల్ పచ్చి మోసగాడు.. చనిపోయేలోపే అతని బండారం బయటపెడతా
మధ్యప్రదేశ్ లోని బర్వానీ జిల్లాకు చెందిన ఓ డ్రైవర్ ఆదివారం ఆన్ లైన్ గేమింగ్ యాప్ లో రూ. 49 పెట్టుబడి పెట్టాడు. వర్చువల్ క్రికెట్ టీంను ఏర్పాటు చేయడంతో అతడు మొదటిస్థానాన్ని సంపాదించాడు. క్రికెట్ గేమింగ్ యాప్ లో రూ.49 కేటగిరీలో వర్చువల్ క్రికెట్ జట్టును క్రియేట్ చేశారు. షహబుద్దీన్ మన్సూరి అనే వ్యక్తి గత రెండేళ్లుగా ఇలాంటి ఆన్ లైన్ క్రికెట్ గేమ్ లలో టీంలను క్రియేట్ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆదివారం కోల్ కతా, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా యాప్ లో క్రికెట్ టీంను ఏర్పాటు చేశాడు. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
షాహబుద్దీన్ తన యాప్ వాలెట్ నుంచి రూ. 1.5 కోట్లలో రూ. 20 లక్షలు విత్ డ్రా చేసుకున్నాడు. మొత్తం రూ.6 లక్షలు పన్నులకు పోగా, అతని బ్యాంకు ఖాతాలో రూ. 14 లక్షలు జమ అవుతాయి. మధ్యప్రదేశ్ లోని సెంద్వాలో అద్దె ఇంట్లో ఉంటున్న షహబుద్దీన్ తాను గెలిచిన డబ్బుతో కొత్త ఇళ్లు కట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. మిగిలిన డబ్బుతో వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.