Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Made A Mistake Ajit Pawar On Fielding Wife Against Sister In 2024 Lok Sabha Polls

Ajit Pawar: రాజకీయాలను ఇంట్లోకి రానీవ్వొద్దు.. తప్పు చేశా..

Published Date :August 13, 2024 , 4:12 pm
By BV Reddy
  • రాజకీయాలను ఇంట్లోకి రానీవ్వొద్దు..
  • సోదరిపై భార్యను పోటీకి దింపి తప్పు చేశా..
  • బారామతి పోరుపై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..
Ajit Pawar: రాజకీయాలను ఇంట్లోకి రానీవ్వొద్దు.. తప్పు చేశా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ajit Pawar: రాజకీయాలను ఇళ్లలోకి రానీవ్వకూడదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన సోదరి సుప్రియా సూలేకి వ్యతిరేకంగా తన భార్య సునేత్రా పవార్‌ని పోటీకి దింపడం ద్వారా తప్పు చేశానని అన్నారు. “నేను నా సోదరీమణులందరినీ ప్రేమిస్తున్నాను. రాజకీయాలను ఇంట్లోకి రానివ్వకూడదు. నా సోదరిపై సునేత్రను పోటీకి దింపడం నేను తప్పు చేశాను. ఇది జరగకూడదు. కానీ పార్లమెంటరీ బోర్డు (ఎన్‌సిపి) నిర్ణయం తీసుకుంది. అది తప్పు అని ఇప్పుడు నేను భావిస్తున్నాను. ” అని ఆయన అన్నారు.

Read Also: AP High Court: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్ల కేటాయింపు జీవో నిలిపివేత

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ‘జన్ సమ్మాన్ యాత్ర’ ద్వారా అజిత్ పవార్ మహారాష్ట్రలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చే ఆర్థిక సాయం ‘ముఖ్యమంత్రి లాడ్కీ బహన్ యోజన’ను ప్రచారం చేస్తున్నారు.

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేకి వ్యతిరేకంగా బారామతి నుంచి సునేత్ర పవార్‌ని బరిలోకి దింపారు. ఈ ఎన్నికల్లో సుప్రియా సూలే గెలుపొందింది. ఆ తర్వాత పరిణామాల్లో సునేత్ర పవార్‌ని రాజ్యసభకు పంపారు. గతేడాడి ఎన్సీపీలో చీలిక వచ్చింది. శరద్ పవార్‌ని కాదని అజిత్ పవార్ వర్గం బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరింది. ప్రస్తుతం బీజేపీ-శివసేన(షిండే)- ఎన్సీపీ(అజిత్ పవార్)ల కూటమి ‘మహాయుతి’ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ajit Pawar
  • Ajit Pawar Wife Sunetra Pawar
  • Supriya Sule

తాజావార్తలు

  • Fog: వేసవిలోనూ దట్టమైన పొగమంచు.. ఏం వాతావరణ మార్పులో ఏమో..!

  • Pak-Afghan War: రంజాన్ వేళ ఆప్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు.. భారీగా ప్రాణనష్టం!

  • AP Cabinet 2026: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపులకు ఆమోదం!

  • Usman Tariq: వింత బౌలర్ ఉస్మాన్ తారిక్‌కు జాక్‌పాట్.. ఎన్ని కోట్లకు అమ్ముడు పోయాడంటే..?

  • Jevon Searles: క్రికెట్‌లో మరో ఫిక్సింగ్ వివాదం.. KKR ఆటగాడిపై ఐసీసీ చర్య.!

ట్రెండింగ్‌

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions