జొమాటో, బ్లింకిట్‌ల మాతృ సంస్థ అయిన ఎటర్నల్ గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్లో అద్భుతాలు చేస్తోంది. కంపెనీ షేర్లు రెండు రోజుల్లో 21 శాతం పెరిగాయి. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.52 వేల కోట్లకు పైగా పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కంపెనీ త్రైమాసిక ఫలితాల కారణంగా కంపెనీ షేర్లు పెరిగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొత్తం స్టాక్ మార్కెట్లో ఒత్తిడి కనిపిస్తోంది. బి.ఎస్.ఇ డేటా ప్రకారం.. మంగళవారం కంపెనీ స్టాక్ రూ.292 వద్ద ప్రారంభమైంది. ఇది కొద్దిసేపటికే గరిష్ట స్థాయి రూ.311.60కి చేరుకుంది. ప్రత్యేకత ఏమిటంటే ఇది కంపెనీ కొత్త 52 వారాల గరిష్ట స్థాయి ఇదే. నేడు మధ్యాహ్నం 2:20 గంటలకు.. కంపెనీ స్టాక్ రూ.301.85 వద్ద 11.30 శాతం లాభంతో ట్రేడవుతోంది. అయితే, ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ స్టాక్ కనిష్ట స్థాయి రూ.289.95కి చేరుకుంది. కాగా.. సోమవారం కంపెనీ స్టాక్ రూ.271.20 వద్ద ముగిసింది.
READ MORE: USA: భారత ఆర్థిక వ్యవస్థ అంతు చూస్తాం.. అమెరికన్ సెనెటర్ వార్నింగ్..
బి.ఎస్.ఇ డేటా ప్రకారం, శుక్రవారం ఎటర్నల్ స్టాక్ రూ.257.35 వద్ద ముగిసింది. అప్పటి నుంచి కంపెనీ స్టాక్ రూ.54.25 పెరిగింది. సోమవారం కూడా కంపెనీ షేర్లు 5.38 శాతానికి పెరిగాయి. మంగళవారం కంపెనీ స్టాక్ 15 శాతం వృద్ధి సాధించింది. ఈ విధంగా, కంపెనీ స్టాక్ రెండు రోజుల్లో 21 శాతం పెరిగింది. ప్రస్తుత ఏడాదిలో కంపెనీ స్టాక్ 9 శాతానికి పైగా పెరిగింది. అయితే.. ఒక సంవత్సరంలో కంపెనీ స్టాక్ 36 శాతం పెరిగింది. 6 నెలల్లో, కంపెనీ పెట్టుబడిదారులకు 39 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. బీఎస్‌ఈ డేటా ప్రకారం.. శుక్రవారం నాటికి స్టాక్ మార్కెట్, కంపెనీ వాల్యుయేషన్ రూ.2,48,147.70 కోట్లు. ఇది మంగళవారం రూ.3,00,457.84 కోట్లకు పెరిగింది. ఈ విధంగా, కంపెనీ మార్కెట్ రూ.52,310.14 కోట్ల పెరుగుదలను చూసింది. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ వాల్యుయేషన్ రూ.38,955.39 కోట్లు పెరిగింది.
READ MORE: Hari Hara Veera Mallu: ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ.. హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలు తొలగింపు!