NTV Telugu Site icon

Raebareli: యూపీలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్ర.. రాయ్‌బరేలీలో ట్రాక్పై ఇసుక కుప్ప

Soil

Soil

Raebareli: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో పట్టాలు తప్పించేందుకు కుట్రలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన రాయ్‌బరేలీ జిల్లాలో జరిగింది. ఖీరూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను చూసిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వెంటనే నిలిపివేశాడు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఖీరోన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దేవేంద్ర భడోరియా మాట్లాడుతూ.. డంపర్ నుంచి రైల్వే ట్రాక్‌పై ఇసుక పోశారని, దానిని తొలగించిన తర్వాత రైలు వెళ్లిందన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది. స్థానికంగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. దీంట్లో భాగంగా మట్టిని రవాణా చేసే పని రాత్రిపూట జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ డ్రైవర్ డంపర్ నుంచి ఇసుకను రైల్వే ట్రాక్‌పై పోసి అక్కడి నుంచి పారిపోయాడన్నారు. ఇది జరిగిన కొసేపటికే రాయ్ బరేలీ- రఘురాజ్ సింగ్ స్టేషన్ మధ్య నడుస్తున్న షటిల్ రైలు ఈ రూట్‌లో వచ్చిందని పోలీసులు వెల్లడించారు.

Read Also: Suryakumar Yadav: అది పెద్ద తలనొప్పి అయ్యింది: సూర్యకుమార్

ఇక, ఆ రైలు లోకో పైలట్ రైల్వే ట్రాక్‌పై మట్టిని గమనించి.. రైలును ఆపాడని ఖోరోన్ పోలీస్ ఇన్ స్పెక్టర్ దేవేంద్ర భడోరియా చెప్పుకొచ్చారు. లోకో పైలట్ అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.. రైల్వే ట్రాక్‌పై మట్టిని తొలగించిన తర్వాత రైలు నెమ్మదిగా ముందుకు వెళ్లిందన్నారు. ఈ టైంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి వచ్చారు. గేట్‌మెన్ మాట్లాడుతూ రైలు వేగం తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది.. ఒకవేళ వేగం ఎక్కువగా ఉంటే రైలు పట్టాలు తప్పేది అన్నారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Show comments