నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-1… ముచ్చటగా మూడోసారి ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇంధన ట్యాంకులో సమస్యల కారణంగా రెండుసార్లు ఈ ప్రయోగం వాయిదా పడింది. లోపాలను సరిదిద్దిన నాసా సాంకేతిక నిపుణులు ఈ నెల 17న ట్యాకింగ్ టెస్ట్‌కు దానిని రెడీ చేశారు. అయితే ఆగస్టు 29న తొలిసారి దీనిని నింగిలోకి పంపేందుకు సిద్ధం చేశారు. చివరి క్షణంలో ఇంధన ట్యాంకులో సమస్యల కారణంగా… ప్రయోగాన్ని వాయిదా వేశారు. అనంతరం లోపాన్ని సరిదిద్ది ఈ నెల 3న మరోమారు ప్రయోగానికి రంగం సిద్ధం చేశారు. అయితే, ఈసారి కూడా అదే సమస్యతో వాయిదా పడింది. ఈసారి ఇంధన ట్యాంకును అణువణువునా గాలించిన నిపుణులు… సీల్స్‌ను రీప్లేస్ చేసి లీకేజీలను అరికట్టి ప్రయోగానికి సిద్ధం చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 23న అది చంద్రుడిపై దూసుకెళ్లనుంది.. మరోవైపు.. అక్టోబర్‌లోనే ప్రయోగం సాధ్యం కాదనే వాదనలు కూడా ఉన్నాయి..
Read Also: Jacqueline Fernandez: ముచ్చటగా మూడోసారి బాలీవుడ్ బ్యూటీకి నోటీసులు.. ఈ సారైనా..?
కాగా, నాసా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆర్టెమిస్-1 పేరుతో ఈ యాత్ర చేపట్టింది. అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్లనుంది… అయితే, ఇందులో వ్యోమగాములు ఉండరు. తర్వాతి దశలో మాత్రం నలుగురు వ్యోమగాములను పంపించేలా ప్లాన్ చేశారు.. 6 వారాలపాటు సాగే ఈ యాత్రలో చంద్రుడిని చేరుకునేందుకు కోన్ ఆకారంలో ఉండే ఓరియన్ స్పేస్‌క్రాఫ్ కు వారం రోజులు పడుతుందని… మొదట ఇది చంద్రుడి ఉపరితలానికి పైన 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యకు చేరుకుంటుందని.. ఆ తర్వాత 61వేల కిలోమీటర్ల దూరంలోని సుదూర కక్ష్యలోకి ప్రవేశిస్తుందని.. ఆ దశలోనే భూమికి 4.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నమాట.. అంటే ఈ దశలో ఓరియన్‌లో కనుక వ్యోమగాములు ఉంటే భూమి, చంద్రుడిని ఒకేసారి చూసే అవకాశం లభించనుంది.