Delhi Red Fort Blast: ఢిల్లీ ఎర్రకొట కార్ బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హ్యాందాయ్ i20లో అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ కలిపి పేలుడుకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 12 మంది మరణించారు. సంఘటన జరిగిన రోజు 9 మంది మరణించగా, చికిత్స పొందుతూ ఈ రోజు మరో ముగ్గురు మరణించారు. అయితే, ఈ ఘటనకు పుల్వామా దాడికి కారణమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ మధ్య సంబంధాలు బయటపడినట్లు తెలుస్తోంది.
కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ స్థాపించిన జైషే మహ్మద్, ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడికి పాల్పడి 40 మంది సైనికులను బలితీసుకుంది. ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని టెర్రర్ స్థావరాలపై దాడులు చేసింది. ఇటీవల, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, జైషే ప్రధాన కార్యాలయం ఉన్న పాకిస్తాన్‌లో బహవల్పూర్‌లో భారత్ క్షిపణి దాడులు చేసి, పదుల సంఖ్యలో ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఈ దాడుల్లో మసూద్ అజార్ బావ యూసుఫ్ అజార్‌తో సహా అతడి కుటుంబంలో 10 మంది మరణించారు. యూసుఫ్ అజార్ మసూద్ అజార్ చెల్లెలు సాదియా అజార్ భర్త. భారత దాడిలో దాని ప్రధాన కార్యాలయం ధ్వంసం కావడంతో, దీనిని పునర్నిర్మాణం చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం స్వయంగా డబ్బులు ఇస్తోంది. ఇదిలా ఉంటే, ఇటీవల జైషే మహ్మద్ తన మహిళా జిహాదీ గ్రూప్ ‘‘జమాత్ ఉల్ ముమినాత్’’ అనే గ్రూపును స్థాపించింది. దీనికి సాదియా అజార్ నేతృత్వం వహిస్తున్నారు. పేదరికంలో ఉన్న మహిళలు, ఉగ్రవాదుల భార్యల్ని, చనిపోయిన ఉగ్రవాద కుటుంబాల్లోని మహిళల్ని రిక్రూట్ చేసుకుంటోంది.
Read Also: Islamabad Blast: ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు.. ఎంత మంది చనిపోయారంటే..
అయితే, ఇప్పుడు ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడుతో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు మధ్య రెండు సంబంధాలు కనిపిస్తోన్నాయి. దీంట్లో మొదటిది టెర్రర్ మాడ్యుల్, రెండోది షషీనా షాహిద్. ఈమె మారుతి స్విఫ్ట్ కారులో ఒక అసాల్ట్ రైఫిల్, మందుగుండు సామాగ్రిని గుర్తించారు. అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని లాకర్‌లో AN అస్సాల్ట్ రైఫిల్‌ను అధికారులు గుర్తించారు. డాకర్ట్ అయినా షషీనా షాహిద్, హర్యానాలోని అల్ ఫలా ఆస్పత్రిలో పనిచేస్తున్న సమయంలో డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌తో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం, షహీనా షాహిద్ భారతదేశంలో జైషే మహిళా విభాగానికి అధిపతి కావచ్చని అనుమానిస్తున్నారు. ఆమెను, ముజమ్మిల్ షకీల్‌ను నిన్న సాయంత్రం ఫరీదాబాద్ లో అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల తర్వాతే కార్ బాంబ్ బ్లాస్ట్ చోటు చేసుకుంది.
ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు డాక్టర్లు ఉండటం గమనార్హం. డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్, ఆయనను యూపీలో సహ్రాన్ పూర్లో అరెస్ట్ చేశారు. జైషే ఉగ్రవాద సంస్థకు చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఈ పేలుడుకు కారణమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. షకీర్, రాథర్ అరెస్ట్ తర్వాత భయాందోళనకు గురైన ఉగ్రవాది ఉమర్ ఢిల్లీ ఎర్రకోట వద్ద కార్ బ్లాస్ట్‌కు పాల్పడ్డాడు.