PM Modi: 2002 సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై దాడి, గుజరాత్ అల్లర్ల గురించి ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడారు. గోద్రాలో 2002 సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన దాడి "ఊహించలేని స్థాయిలో జరిగిన విషాదం" అని ఆయన అన్నారు. దీని తర్వాత జరిగిన అల్లర్లు ‘‘ప్రతీ ఒక్కరికి విషాదకరమైనవి’’గా చెప్పారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్‌లో ఒక్క అల్లరి కూడా జరగలేదని చెప్పారు.
Lex Fridman: అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్, ప్రధాని నరేంద్రమోడీని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ప్రధాని వర్తమాన అంతర్జాతీయ పరిణామాలు, పాక్ అంశం, ఉక్రెయిన్ వార్, డొనాల్డ్ ట్రంప్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, ఈ ఇంటర్వ్యూ కోసం తాను 45 గంటల పాటు ‘‘ఉపవాసం’’లో ఉన్నట్లు లెక్స్ ఫ్రిడ్‌మాన్ చెప్పారు. ‘‘సరైన మనస్తత్వాన్ని పొందడానికి’’ దాదాపుగా 2 రోజలు ఉపవాసం ఉన్నానని చెప్పి ప్రధాని మోడీని ఆశ్చర్యపరిచారు.
PM Modi : వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తొలి అంతర్జాతీయ పాడ్‌కాస్ట్‌ను ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో మాట్లాడతారు.