ఫిబ్రవరి 10 వ తేదీన ఆర్జేడీ కార్యనిర్వాహక సమావేశం జరగనున్నది. ప్రతి ఏడాది పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి జరుగుతున్న మార్పులపై చర్చిస్తారు. ప్రజాసమస్యలపై ఎలాంటి పోరాటం చేయాలో పార్టీలో చర్చిస్తుంటారు. అయితే, దాణా కుంభకోణం కేసులో మొన్నటి వరకు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక, 2020లో జరిగిన బీహార్ ఎన్నికల్లో లాలూ చిన్నకొడుకు తేజశ్వీ యాదవ్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లారు. పార్టీ గెలుపు అంచులవరకు వెళ్లింది. కొన్ని కారణాల వలన పార్టీ ప్రతిపక్షంలో కూర్చో వలసి వచ్చింది. పార్టీని విజయవంతంగా నడిపిస్తున్న తేజశ్వీ యాదవ్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Read: బీజింగ్ ఒలింపిక్స్‌లో కరోనా కరకలం…
ఈ వార్తలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పగ్గాలు అప్పగిస్తారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అలా అనుకునేవారంతా ఫూల్స్ అని, పార్టీ ఏం నిర్ణయిస్తుంది అన్నది తాము స్వయంగా చెబుతామని లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. అటు లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి కూడా ఇదే విధమైన సమాధానం చెప్పింది. ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉంటారని తెలియజేసింది.