Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్‌లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
- దేశంలో మండిపోతున్న ఎండలు
- బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్న ప్రజలు
- లడఖ్‌లో మాత్రం విచిత్ర వాతావరణం
- భారీగా కురుస్తున్న హిమపాతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం దేశంలో ఆయా ప్రాంతాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంతటి భయంకరమైన పరిస్థితులు దేశంలో ఉంటే.. లడఖ్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. లడఖ్‌లో ప్రస్తుతం భారీ హిమపాతం కురుస్తోంది. దీంతో వాతావరణం ఆహ్లాదరకరంగా మారింది. ప్రజలు ఉల్లాసంగా గడుపుతున్నారు.
లడఖ్‌లోని జోజిలా కనుమ చుట్టుపక్కల ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. కార్గిల్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతంలోని పర్వతాలు మంచు దుప్పటితో కప్పబడి ఉన్నాయి. అసలు వేడి జాడే లేదు. పార్క్ చేసిన వాహనాలు మంచు పొరతో కప్పుకున్నాయి. మరోవైపు మైదాన ప్రాంతాల్లో మండుతున్న ఎండలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. రాజధాని ఢిల్లీలో అయితే అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. హీట్ భరించలేక బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లడఖ్‌లో కురుస్తున్న భారీ హిమపాతంతో అక్కడ ప్రజలు సేదతీరుతున్నారు. ఇక భారీ హిమపాతం కారణంగా ప్రధాన రహదారిలో రాకపోకలకు నిలిపివేశారు. లడఖ్‌ను కాశ్మీర్ లోయతో కలిపే ఏకైక మార్గం ఇదే. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. రాబోయే మూడు రోజుల పాటు ఈ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాబోయే ఏడు రోజుల పాటు ఢిల్లీలో వడగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రాజధానిలో రాబోయే ఏడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే వారం పాటు హర్యానా, పంజాబ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
#WATCH | Kargil: Fresh snowfall occurred in the Minamarg area near Zojila Pass. pic.twitter.com/YWiI3FgGBt
— ANI (@ANI) May 21, 2026
VIDEO | Fresh snowfall blankets Minamarg near Zojila Pass in Ladakh.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/B0G1uHnP4r
— Press Trust of India (@PTI_News) May 21, 2026
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!