KSRTC: అంతరాష్ట్ర ప్రయాణికులకు KSRTC బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే టికెట్ పైన 10 % తగ్గింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: దీపావళి సందర్భగా KSRTC ప్రయాణికులకు శుభవార్తను చెప్పింది. ఈ నెల 12న నరక చతుర్దశి, 14న బలిపాడ్యమి రానున్నాయి. ఈ పండగల సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అలానే పండగకు ఇల్లకు వెళ్లి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు 2000 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు KSRTC పేర్కొన్నది. ఈ నేపధ్యంలోఇల్లకు వెళ్లే వాళ్ళ కోసం నవంబర్ 10 నుంచి 12 వరకు అదనంగా 2 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలానే రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి, అలానే అంతర్రాష్ట్రాల నుండి బెంగళూరుకు తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం నవంబర్ 14-15 తేదీలలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు KSRTC తెలియజేసింది. వాళ్లకు కెంపేగౌడ బస్ స్టేషన్ నుండి ధర్మస్థల, కుక్కేసుబ్రమణ్య, షిమోగా, హసన్, మంగళూరు, కుందాపూర్, శృంగేరి, హొరనాడు, దావణగెరె, హుబ్లీ, ధార్వాడ్, బెల్గాం, విజయపూర్, గోకర్ణ, షిర్సి, కార్వార్, రాయచూర్, కలబురగి, బళ్లారి, కొప్పల్‌లకు బీదర్, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ మొదలైన ప్రాంతాలకు ప్రత్యేక రవాణా సేవ అందుబాటులో ఉంది.
Read also:Mahmood Ali: హోంమంత్రి మహమూద్ అలీ కారును చెక్ చేసిన పోలీసులు
Also Read
అలానే మైసూర్ రోడ్ బస్ స్టేషన్ నుండి మైసూర్, హున్సూర్, పిరియాపట్నం, విరాజ్‌పేట్, కుశాలనగర్, మడికేరి మార్గం వైపు కార్యకలాపాలు నిర్వహించనున్నారు. తమిళనాడు, కేరళ లోని మధురై, కుంభకోణం, చెన్నై, కోయంబత్తూర్, తిరుచ్చి, పాలక్కాడ్, త్రిస్సూర్, ఎర్నాకులం, కాలికట్ మొదలైన ప్రాంతాలకు వెళ్లే ప్రీమియం రవాణాలు శాంతినగర్ లోని బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్టాండ్ నుండి నడపబడతాయని KSRTC తెలియజేస్తుంది. ప్రయాణీకుల సౌకర్యార్థం అదనపు రవాణా కోసం ముందస్తు సీటు రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించబడ్డాయి. కాగా ఏజెన్సీ ప్రకారం.. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు కలిసి ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అలానే ఔట్‌బౌండ్రి, టర్న్ టిక్కెట్లు కలిసి బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణ ఛార్జీలో 10 శాతం తగ్గింపు ఇవ్వబడుతుంది. www.ksrtc.karnataka.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ-టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్‌తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్‌లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్‌కు డెడ్‌లైన్.!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!