Home Minister Mahmood Ali: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి అనుచరులు డబ్బు, మద్యం, బహుమతులతో ఓటర్లను ప్రలోభపెట్టకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా ఎక్కడికక్కడ ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు. సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల నేతల వాహనాలనే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల వాహనాలను కూడా తనిఖీ చేస్తున్న పోలీసులు… చివరకు హోంమంత్రి కారును కూడా వదలడం లేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో మైనారిటీ ఓట్లు కూడా ఎక్కువగా ఉండడంతో బీఆర్ఎస్ మహమూద్ అలీతో కలిసి ప్రచారం చేయిస్తున్నారు. కామారెడ్డి తరపున ప్రచారానికి వెళ్తున్న హోంమంత్రి మహమూద్ అలీ కారును పోలీసులు అడ్డుకున్నారు. హోంమంత్రి కామారెడ్డిలో మైనారిటీ సమావేశానికి వెళ్తుండగా.. దారిలో చెక్‌పోస్టు వద్ద తనిఖీ నిమిత్తం పోలీసులు కారును ఆపారు. వెంటనే కారు దిగిన మహమూద్ అలీ పోలీసులకు సహాయం చేశాడు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు ఏమీ దొరకకపోవడంతో అక్కడి నుంచి పంపించారు. ఈ తనిఖీలో హోంమంత్రితోపాటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా కారులో ఉన్నారు.
War 2: ఎన్టీఆర్-హ్రితిక్ ప్రోమో షూట్?