Sharad Pawar: శరద్ పవార్ కొత్త పార్టీ.. ఈసీ గ్రీన్‌సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరద్ పవార్ (Sharad Pawars) కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొత్త పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఎన్‌సీపీ శరద్ చంద్రపవార్ పార్టీగా నామకరణం (New Name) చేసింది. సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం బిగ్ షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీ(NCP)గా గుర్తిస్తూ గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. దీంతో శరద్ పవార్ వర్గం ఝలక్‌కు గురైంది. కానీ 24 గంటలు గడవక ముందే కొత్త పార్టీ పేరు బయటకు వచ్చేసింది.
ఎస్పీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్న విషయం తెలిసిందే.
గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర ఎన్సీపీ ఎవరిదనే అంశంపై రగడ జరుగుతోంది. పార్టీలో చీలికలు వచ్చి కుమ్ములాటలు జరగుతున్నాయి. దీంతో ఈసీ అజిత్ పవార్ వర్గానికే పార్టీని కట్టబెట్టింది. ఎన్సీపీకి మొత్తంగా 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అజత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఆ పార్టీపై నియంత్రణ కోల్పోయారు. ప్రస్తుతం ఆయనకు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
2023లో ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలో ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలే మంత్రులయ్యారు. మొత్తానికి 24 గంటలు గడవక ముందే శరద్‌పవార్ కొత్త పార్టీని స్థాపించేశారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌సీపీ శరద్ చంద్రపవార్ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మరీ ఏ మేర విజయం సాధిస్తుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!