కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దోహాకి బయల్దేరిన ఖతార్ ఎయిర్వేస్ విమానంలో ఓ ప్రయాణికుడి వల్ల బాంబు భయం ఏర్పడింది. ప్రయాణికులు మరియు సిబ్బందితో సహా విమానంలో ఉన్న మొత్తం 186 మందిని విమానం నుండి తరలించారు. విమానంలో బాంబు ఉందని హెచ్చరించాడు.
Also Read: Lifestyle : 18 ఏళ్ల వయస్సులో అమ్మాయిలు, అబ్బాయిలు చెయ్యకూడని తప్పులు?
దీంతో విమానం బయలుదేరే సమయానికి కొద్దిసేపటి ముందు ఈ సంఘటన జరిగింది. సిబ్బంది వేగంగా విమానాశ్రయంలో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్)ని అప్రమత్తం చేశారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి తరలించారు. సీఐఎస్ఎఫ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేసి అందరి భద్రతను కట్టుదిట్టం చేశారు. స్నిఫర్ డాగ్స్ ద్వారా విమానాన్ని వెతికారు.
Also Read: Venkatesh : వారు చెప్పే కధలు వెంకటేష్ కు నచ్చడం లేదా..?
విమానంలో బాంబు ఉందన్న అనుమానంతో తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సమచారం అందిందని పేర్కొన్నాడు. అయితే, ఆ వ్యక్తి తండ్రి తన కుమారుడి మానసిక ఆరోగ్య సమస్యల గురించి CISF అధికారులకు చెప్పి దానికి సంబంధించిన పత్రాలను సమర్పించాడు. సరైన తనిఖీ తర్వాత, విమానం ఉదయం 9 గంటలకు దోహాకు బయలుదేరింది. అయితే.. తరచు విమానాల్లో బాంబు బెదిరింపులు వస్తుండటంతో అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. విమానాల్లో ప్రయాణిం చేసే సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.