Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
- కోల్‌కతా ఎయిర్ పోర్టు తరలింపుపై మళ్లీ చర్చ..
- బీజేపీ ప్రభుత్వం రాకతో తరలిస్తారే ప్రచారం..
- 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బంక్రా మసీద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Airport Mosque: కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న 136 ఏళ్ల పురాతన మసీదు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన భద్రత, రన్‌వే కార్యకలాపాలకు ఆటంకంగా మారుతోందని అధికారులు గత కొన్ని దశాబ్ధాలుగా చెబుతూనే ఉన్నారు. కానీ పాలకుడు మాత్రం ఓట్ల వేటలో ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ మసీదుపై మరోసారి చర్చ మొదలైంది.
‘‘గౌరీపసూర్ జామే మస్జిద్’’ లేదా ‘‘బంక్రా మసీదు’’గా పిలిచే ఈ మసీదు ఏయిర్పోర్టు రన్ వే పక్కనే ఉంది. దీంతో ఇది భద్రతా పరమైన ఆందోళనల్ని పెంచుతోంది. ఎయిర్ పోర్ట్ ఆపరేషనల్ జోన్లోనే ఈ మసీదు ఉంది. సెకండ్ రన్‌వేకు కేవలం 165 మీటర్ల దూరంలో ఉంది. నియమాల ప్రకారం కనీసం 240 మీటర్ల దూరంలో ఉండాలి. దీని కారణంగా విమానాలు దిగే టచ్ డౌన్ పాయింట్‌ను 88 మీటర్లకు మార్చాలి వచ్చింది. పెద్ద విమానాలు ల్యాండ్ కావాలంటే సమస్యలు ఎదురవుతున్నాయి. అత్యవసర ల్యాండింగ్ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
పశ్చిమ బెంగాల్లో పాలన చేపట్టిన ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా ఈ మసీదు జోలికి వెళ్లలేదు. సీపీఎం ప్రభుత్వం ఉన్న సమయంలో జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్జి, టీఎంసీ ప్రభుత్వ సమయంలో సీఎం మమతా బెనర్జీలు ఈ మసీదును తరలించే ప్రయత్నాలను అడ్డుకున్నారు. అయితే, ప్రస్తుతం సీఎం సువేందు అధికారి ఉండటంతో ఈ ప్రార్థనా మందిరం మార్పు తప్పక ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆప్ ఇండియా(ఏఏఐ) అధికారులు మసీదు వద్ద తనిఖీలు నిర్వహించారు. అనంతరం మసీదు కమిటీ సభ్యులతో మసీదు తరలింపుపై చర్చించారు.
మే 28 బక్రీద్ వరకు మసీదు తరలింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని జిల్లా అధికారులు, ఎయిర్ పోర్టు అధికారులు నిర్ణయించారు. ఈద్ తర్వాత దీనిపై నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతం రోజుకు 10 నుంచి 25 మంది వరకు నమాజ్ చేసుకునేందుకు ఆ మసీదుకు వెళ్తున్నారు. శుక్రవారం రోజు ఈ సంఖ్య 80కి చేరుతుంది. సీఐఎస్ఎఫ్ కఠినమైన భద్రతా తనిఖీలు, ఐడీ కార్డ్ చెక్ చేసిన తర్వాతనే ప్రార్థన చేసుకునేందుకు అనుమతిస్తున్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!