King Cobra: ఎవరెస్ట్ శిఖరానికి సమీపంలో ‘‘కింగ్ కోబ్రా’’ పాములు.. శాస్త్రవేత్తల్లో కలవరం..
- ఎవరెస్ట్ శిఖరం సమీపంలో కింగ్ కోబ్రా పాములు..
- శాస్త్రవేత్తల్లో పెరుగుతున్న ఆందోళనలు..
- వాతావరణ మార్పుల కారణమని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King Cobra: హిమాలయాలు, ముఖ్యంగా ఎవరెస్ట్ పర్వతాలకు సమీపంలో విషపూరిత పాములు కనిపించడం శాస్త్రవేత్తల్ని కలవరపరుస్తోంది. నేపాల్ లోని ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ఒకటిన్నర నెలల వ్యవధిలో 10 విషపూరిత పాములు, ఇందులో 09 కింగ్ కోబ్రా పాములను పట్టుకున్నారు. ఇలా అత్యంత శీతల ప్రాంతంలో కింగ్ కోబ్రా పాములు కనిపించడంపై సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాములను నాలుగు వేర్వేరు ప్రాంతాలు గోపాలేశ్వర్, భంజ్యాంగ్, సోఖోల్, ఫుల్చౌక్ ప్రాంతాల నుండి- రక్షించినట్లు దక్షిణ్ కాళి మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు.
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. గూడును నిర్మించుకునే ఈ పాము లక్షణం, దీనిని ఇతర పాముల నుంచి వేరు చేస్తుంది. దీని విషం అత్యంత శక్తివంతమైంది. ఒక్క కాటులో విడుదల చేసే విషంతో ఏకంగా 20 మందిని లేదా పెద్ద ఏనుగును చంపేంత శక్తి ఉంటుంది.
Also Read
- Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Gangster Goldy Brar: “సిద్ధూ మూసే వాలా” హత్యకు కారణాలు వెల్లడించిన గ్యాంగ్‌స్టర్..
కింగ్ కోబ్రాస్ మరియు మోనోక్లెడ్ కోబ్రాస్, రెండూ పాములు, దక్షిణ నేపాల్, ఉత్తర భారతదేశంలోని తారై రీజియన్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండటంతో, ఇవి ఇప్పుడు కొండ, పర్వత ప్రాంతాల్లో గూళ్లు కట్టుకుని కనిపిస్తు్న్నాయి. శీతల ప్రాంతంలో ఈ పాములు ఉండటం వాతావరణ మార్పుల వల్ల కావచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారనంగా ఈ ఉష్ణమండల పాములు చల్లని ప్రాంతాలకు వెళ్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పు ఇలాగే కొనసాగితే, అతి ఈ ప్రాంత పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది.
గత కొన్ని ఏళ్లుగా నేపాల్ వాతావరణ మార్పులను చూస్తోంది. నేపాల్ గరిష్ట ఉష్ణోగ్రత ఏడాదికి 0.05 డిగ్రీ సెల్సియన్ చొప్పున పెరుగుతోంది. నివాస విధ్వంసం, మానవ సంఘర్షణ, పాము కాట్లు కింగ్ కోబ్రాలకు గణనీయ ముప్పుని కలిగిస్తున్నాయి. ముఖ అంతర్జాతీయ వైద్య పత్రిక అయిన ది లాన్సెట్‌లో మార్చి 2022లో ప్రచురించబడిన ఒక నివేదికలో వేసవిలో తరై జిల్లాల్లో పాముకాటు ఫలితంగా మరణాలు సర్వసాధారణమని హైలైట్ చేసింది. ప్రతి సంవత్సరం, నేపాల్‌లోని తరై ప్రాంతానికి చెందిన దాదాపు 2,700 మంది, ఎక్కువగా పిల్లలు మరియు మహిళలు, పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!