Site icon NTV Telugu

MP Imran Masood: ‘‘మూడు కాకుల్ని చంపారు’’.. “సర్జికల్ స్ట్రైక్స్‌”పై మరో కాంగ్రెస్ నేత..

Imran Masood

Imran Masood

MP Imran Masood: 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడుతుందా?? గతంలో మాదిరిగానే సర్జికల్ స్ట్రైక్స్ లేదా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహిస్తుందా.? అని యావత్ దేశం చూస్తోంది. రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి సంఘర్షణ వచ్చే అవకాశం ఉందా అనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్‌పై దౌత్యపరంగా, ఆర్థిక పరంగా తీవ్ర చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్‌కి కీలకమైన ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ భారత్ నిలిపేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు టూరిస్టుల ‘‘మతాన్ని’’ అడగలేదంటూ కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రస్తుతం ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ ‘‘సర్జికల్ స్ట్రైక్స్’’ గురించి అనుమానాలు ఉన్నాయని అన్నారు.

Read Also: Barrelakka: “నాకు పెళ్లైన సంతోషం కూడా లేదు” బర్రెలక్క వీడియో వైరల్..

తాజాగా, మరో ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సర్జికల్ స్ట్రైక్స్ గురించి అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘సర్జికల్ స్ట్రైక్స్‌తో భారత్ ప్రపంచం ముందు నవ్వులపాలైంది’’ అని అన్నారు. యూపీఏ 10 ఏళ్ల పాలనలో 3000 మంది పౌరులు మరణించారు, ఆ సమయంలో ఉగ్రవాదులపై ఎలాంటి సైనిక చర్య తీసుకోలేదని ఇంటర్వ్యూ నిర్వహించిన హోస్ట్ ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉరి జరిగినప్పుడు, సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి; పుల్వామా జరిగినప్పుడు, బాలకోట్‌లో వైమానిక దాడులు జరిగాయి’’ అని ఆమె అన్నారు.

దీనికి మసూద్ స్పందిస్తూ.. ప్రపంచం మొత్తం వైమానిక దాడి గురించి నవ్వుకుందని, పాకిస్థానీలు మా మూడు కాకులను చంపారని చెబుతున్నారని అన్నారు. దీనికి ముందు, కాంగ్రెస్‌కి చెందిన ఎంపీ చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మే 2న న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం తర్వాత చన్నీ మాట్లాడుతూ.. “మన దేశంలో బాంబు పడితే, ఎవరికీ తెలియదు. మేము పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించామని వారు చెబుతున్నారు. ఏమీ జరగలేదు, సర్జికల్ స్ట్రైక్స్ కనిపించలేదు, వాటి గురించి ఎవరికీ తెలియదు.” అని అన్నారు.

Exit mobile version