Khalistan: “మీ కోసం వస్తున్నాం”.. భారత నాయకులకు ఖలిస్తానీల బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: ఖలిస్తానీ వేర్పాటువాదులు పేట్రేగిపోతున్నారు. కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే వేదికగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. భారత రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడటంతో పాటు ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులపై దాడికి పాల్పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ‘సిక్ ఫర్ జస్టిస్’ గురుపత్వంత్ సింగ్ పన్నూ భారతీయ నాయకులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇటీవల జీ20 సదస్సుకు హాజరైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన సమయంలో కూడా ఖలిస్తానీ వేర్పాటువాదం, భారత వ్యతిరేక చర్యలపై చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. ఇదిలా ఉంటే మరోవైపు కెనడాలో ఖలిస్తానీలు రెచ్చిపోతున్నారు. తాజాగా సర్రే, వాంకోవర్ ప్రాంతాల్లోని గురుద్వారాలో ‘ఖలిస్తానీ రెఫరెండం’ నిర్వహించారు.
Also Read
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
Read Also: Monu Manesar: వివాదస్పద గోసంరక్షకుడు మోను మనేసర్ అరెస్ట్..
కెనడాలో జరిగిన ఈ సమావేశంలో నిషేధిత యూఎస్‌కి చెందిన సిక్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత నాయకులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, హోమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శకంర్ లను బెదిరించాడు. ‘హర్దీప్ సింగ్ నిజ్జర్ ను హత్య చేసిన వారికి సందేశం, మీ చావు కోసం పిలుస్తున్నాం.. మోడీ, అమిత్ షా, జైశంకర్ మేము మీ కోసం వస్తున్నాం ’అంటూ ఒక వీడియోలో చెప్పాడు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే కరుడుగట్టిన ఖలిస్తాన్ వేర్పాటువాది ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని సర్రేలో జరిగిన కాల్పుల్లో మరణించాడు. అంతకుముందు సిక్కు వేర్పాటువాదానికి మద్దతు ఇస్తూ లాహోర్ లో ఉంటున్న పరమజిత్ సింగ్ పంజ్వార్ ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. దీనికి ముందు వేర్పాటువాది బ్రిటన్ లో ఉంటున్న అవతార్ సింగ్ ఖండా అనుమాస్పదంగా మరణించాడు. లాహోర్ ఉంటూ నార్కో టెర్రరిజానికి పాల్పడుతున్న హర్మీత్ సింగ్ హత్య చేయబడ్డాడు.
తాజావార్తలు
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
-
Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
-
Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!