Amritpal Singh Hunt: పంజాబ్ సీఎం కూతురికి ఖలీస్థానీ గ్రూప్ నుంచి బెదింరిపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాక్ ప్రేరేపతి ఖలీస్తానీ సానుభూతిపరుడు, వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కోసం గాలింపు చర్యలు కోనసాగుతున్న తరుణంలో.. ఖలీస్తానీ మద్దతుదారులు తీవ్ర చర్యలకు దిగుతున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులపై దాడులు చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ మేరకు తమకు బెదిరింపు లేఖలు, మెయిల్స్, మెసేజ్ లు వచ్చిన్నట్లు పలువురు విద్యార్థులు, రాజకీయ నేపథ్యం ఉన్న పలు భారతీయ కుటుంబాలు వాపోతున్నారు.
Also Read : KVP Ramachandra Rao: ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఈ క్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూతురు సీరత్ కౌర్ కు సైతం ఈ బెదిరింపులు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ చెప్పారు. సియాటెల్( సీటెల్) లో ఉంటున్న సీరత్ కౌర్ కు చంపేస్తామని బెదిరింపులు వెళ్లాయట.. ఈ మేరకు ఆమెకు భద్రత కల్పించాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని స్వాతి మలివాల్ కోరారు.
మరో వైపు ఈ బెదిరింపులకు సంబంధించిన విషయాన్ని హర్మీత్ బ్రార్ అనే అడ్వొకేట్ తన ఫేస్ బుక్ పోస్ట్ లో ప్రస్తావించారు. బెదిరించినంత మాత్రానా.. పిల్లలను తిట్టినంత మాత్రానా మీకు ఖలీస్థాన్ వస్తుందా.. అని ఖలీస్తాన్ మద్దతుదారులను ఉద్దేశించి పోస్ట్ చేశాడు.
Also Read : Nani: స్టార్ హీరోలందరి రికార్డ్స్ బద్దలయ్యాయి… మిగిలింది మహేశ్ బాబు ఒక్కడే
బెదింరింపులను సీరత్ కౌర్ తల్లి ఇందర్ ప్రీత్ కౌర్ గ్రెవాల్ ధృవీకరించారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, తమను వదిలేయాలంటూ ఆమె ఖలీస్తానీలను కోరింది. ఇక స్థానిక గురుద్వారా నుంచే ఈ బెదిరింపులు వచ్చినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే ఇందర్ ప్రీత్, భగవంత్ మాన్ కు మొదటి భార్య, వీళ్లకు ఇద్దరు సంతానం. కూతురు సీరత్, కొడుకు దిల్షాన్ ఉన్నారు. 2015 నుంచి వీళ్లిద్దరూ విడిగా ఉంటుండగా.. తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆపై కొడుకు, కూతురితో ఇందర్ ప్రీత్ కౌర్ విదేశాలకు వెళ్లి స్థిరపడింది. ఇదిలా ఉంటే గత సంవత్సరం మాన్, గుర్ ప్రీత్ కౌర్ అనే డాక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు.
Also Read : Priyanka Hugs Karan: కరణ్ జోహార్‌ను కౌగిలించుకున్న ప్రియాంక చోప్రా
ఖలీస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అమెరికాకు చెందిన వేర్పాటువాడ గ్రూప్.. సిక్స్ ఫర్ జస్టిస్.. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు, రాజకీయ నేపథ్యం ఉన్న పలు భారతీయ కుటుంబాలకు హెచ్చరికలు జానరీ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్స్ బయటకు వచ్చాయి. అమెరికాతో పాటు యూరప్. ఆస్ట్రేలియాలో ఉన్న పలు ప్రాంతాల్లోనూ ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : Bride Pulls Off Gun: పాపం పెళ్లి కూతురు ఒకటి అనుకుంటే.. ఇంకోటి అయ్యింది..!
ఖలీస్తానీ నేత జర్నెల్ సింగ్ భింద్రావాలేకు ప్రతిరూపంగా.. భింద్రావాలే 2.0 అమృత్ పాల్ సింగ్ ను ఖలీస్తానీ మద్దతుదారులు పిలుచుకుంటున్నారు. గత 14 రోజులుగా అతని ఆచూకీ కోసం పంజాబ్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతని అనుచరులను వంద మందికిపైగా అరెస్ట్ చేసి.. జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు పలు ప్రాంతాలు తిరుగుతూ, వేషాలు మారుస్తున్న అమృత్ పాల్ సింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!