Kerala youth beaten to death by his cousin for being late in feeding his dog: కేరళలో దారుణం జరిగింది. పెంపుడు కుక్కకు ఆహారం ఇవ్వడం ఆలస్యం అయిందని కజిన్ ను చంపేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోొ జరిగింది. ముళయంకవు పెరుబ్రతోడిలోని అబ్దుల్ సలాం, అయిషా దంపతుల కుమారుడు అర్షద్(21) అతని బంధువు హకీమ్(27)తో కలిసి పాలక్కాడ్ లోని మన్నెంగోడ్ లోని అథానిలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అర్షద్ పెంపుడు కుక్కకు ఆహారం ఇవ్వడం ఆలస్యం కావడంతో హకీమ్ తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన అర్షద్ ను శుక్రవారం స్థానికంగా ఉన్న వాణియంకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు.
Read Also: By elections: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం.. 4 స్థానాలు కైవసం చేసుకునే దిశగా..
అయితే మేడపై జారి పడిపోయాడని వైద్యులకు చెప్పాడు. అయితే అర్షద్ ఒంటిపై ఉన్న దెబ్బలు చూసిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. అర్షద్ ఒంటిపై దాదాపుగా 100కు పైగా గాయాలు ఉన్నాయి. అనుమానంతో వచ్చిన డాక్టర్లు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హకీమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. చికిత్స పొందుతూ శుక్రవారం అర్షద్ మరణించాడు. అంతర్గత రక్తస్రావం కావడంతో అర్షద్ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. బెల్ట్, కర్రలతో కొట్టడంతో చనిపోయాడు అర్షద్.
అర్షద్ కుక్కకు ఆహారం ఇవ్వడం ఆలస్యం కావడంతో పెంపుడు కుక్కు కనిపించకుండా పోయింది. దీంతో అర్షద్ ను హకీమ్ దారుణంగా కొట్టాడు. అతిని పక్కటెముకలు విరిగిపోయి, అంతర్గత రక్తస్రావం అయినట్లు వైద్యులు వెల్లడించారు. శనివారం పోలీసులు వీరిద్దరు అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి సాక్ష్యాలు సేకరించారు. శుక్రవారం సాయంత్రం హకీమ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అర్షద్, హకీంలు ఇద్దరు ఓ ప్రైవేటు మొబైల్ టెలికాం కంపెనీకి కేబుల్ వర్క్క్ చేస్తున్నారు. అయితే ఎలాంటి కారణం లేకుండా అర్షద్ ను, హకీమ్ ఎప్పుడూ కొట్టే వాడని తెలుస్తోంది.