Brain-Eating Amoeba: కేరళను భయపెడుతున్న పీఏఎం వ్యాధి.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి
- కేరళ రాష్ట్రాన్ని భయపెడుతున్న బ్రెయిల్ ఈటింగ్ వ్యాధి..
- కోజికోడ్ లో మెదడు తినే వ్యాధితో 15 ఏళ్లు బాలుడు మృతి..
- ఈ వ్యాధి వల్ల ఇప్పటి వరకు కేరళలో చనిపోయిన ముగ్గురు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brain-Eating Amoeba: కేరళ రాష్ట్రాన్ని బ్రెయిన్ ఈటింగ్ వ్యాధి భయపెడుతుంది. కోజికోడ్ లో మెదడుని తినే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (పీఏఎం) వ్యాధితో 15 ఏళ్ల బాలుడు మరణించాడు. చెరువులో స్నానానికి దిగిన తర్వాత అతడికి ఈ వ్యాధి వచ్చింది. కోజికోడ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పీఏఎంతో ఐదేళ్ల బాలిక ట్రిట్మెంట్ తీసుకుంటుంది. దీంతో, కేరళలో పీపీఎంకి సంబంధించిన నాలుగో కేసు కూడా నమోదైంది. కోజికోడ్ లో గత రెండు నెలల్లోనే అరుదైన ఇన్ఫెక్షన్ తో ఇప్పటి వరకు మొత్తంగా ముగ్గురు చనిపోయారు. కాగా, పీఏఎం వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన శుక్రవారం ఉన్నత స్థాయి భేటీ జరిగింది. మురికి నీటి ప్రదేశాల్లో ఈతకు ఎవరూ వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Hyderabad Rains: హైదరాబాద్ కు పొంచి ఉన్న వరుణుడి ముప్పు.. రెండు రోజులు భారీ వర్షాలు..
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్‌బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ఇక, స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరినేషన్ తప్పని సరి చేయాలని సీఎం విజయన్ పేర్కొన్నారు. చిన్నారులు ఈ వ్యాధి బారిన పడే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నారు. పిల్లలు ఈతకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. స్విమ్మింగ్ చేసేటప్పుడు నోస్ క్లిప్‌లను వాడటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ను నివారించవచ్చన్నారు. అంటువ్యాధులను నివారించడానికి నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడం సమష్టి బాధ్యత అని అధికారులకు ఆయన సూచించారు. అయితే, పీఏఎం అనే వ్యాధి నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వస్తుంది అని నిపుణులు తెలిపారు. ఈ అమీబా నీటి ద్వారా మనిషి శరీరంలోకి చేరుతుంది. నాలుగు రోజుల్లోనే మానవ నాడీ వ్యవస్థపై (మెదడుపై) దాడి చేస్తుందని చెప్పారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
అలాగే, 14 రోజుల వ్యవధిలోనే దాని వల్ల మెదడులో వాపు వస్తుంది అని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఫలితంగా బాధితుడు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ ఏడాది కేరళలో ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు చనిపోయారని చెప్పారు. ఇకపోతే, మే 21న పీఏఎం వ్యాధి వల్ల కేరళలో తొలి మరణం నమోదు కాగా.. మలప్పురానికి చెందిన ఐదేళ్ల బాలిక పీఏఎంతో రెండో మరణం సంభవించగా.. ఆ తర్వాత జూన్ 12వ తేదీన కన్నూరుకు చెందిన 13 ఏళ్ల బాలిక ఆ వ్యాధితో మరణించడం మూడొది కాగా.. ఇప్పుడు 14 ఏళ్ల బాలుడు చనిపోయాడు.
తాజావార్తలు
-
Astrology: ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోని 3 రాశులు వీరేనా? ఫిక్స్ అయితే వెనక్కి తగ్గరట!
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!