NTV Telugu Site icon

MLC Kavitha: కవిత సీబీఐ లిక్కర్ కేసు.. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: కవిత సీబీఐ లిక్కర్ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారించనుంది. కవితపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే పరిగణలోకి తీసుకుంది. ఇవాళ కవితను తీహార్ జైల్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచనున్నారు. కవితపై చార్జిషీటులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పాలసీ రూపకల్పనలో ప్రధాన సూత్రధారి కవిత అని సీబీఐ పేర్కొంది. మద్యం వ్యాపారులకు అనుకూలంగా మద్యం పాలసీ తయారీ… అందుకు సౌత్ గ్రూప్ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందాయి. రూ. 100 కోట్ల విరాళాలు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంలో కవిత సూత్రధారి అని సీబీఐ చెబుతోంది. కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్ పల్లి, అరుణ్ పిళ్లై, అశోక్ కౌశిక్ పనిచేశారని సీబీఐ చెబుతోంది. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కోసం కవితకు మాగుంట రాఘవ, వెనక శరత్‌రెడ్డి డబ్బులు సమకూర్చినట్లు సమాచారం.

Read also: Dilsukh Nagar Bomb Blasts: దిల్ సుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి..

కవిత సహకారంతో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి మద్యం వ్యాపారంలో చిల్లర జోన్లు సంపాదించారని, ఇందుకోసం కవితకు డబ్బులు ఇచ్చారని సీబీఐ చెబుతోంది. మద్యం వ్యాపారం పేరుతో వసూలు చేసిన సొమ్మును హవాలా ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు సీబీఐ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవితను దర్యాప్తు సంస్థ ఏప్రిల్ 11న అరెస్టు చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం ఏప్రిల్ 15 నుంచి జుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు.కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. జూలై 1న ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలకు ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కస్టడీని ఆగస్టు 31 వరకు పొడిగించిన జస్టిస్ కావేరీ బవేజా గురువారం సీబీఐ దాఖలు చేసిన అవినీతి కేసులో ఆగస్టు 8 వరకు పొడిగించారు.
Rains Updates: తెలుగు రాష్ట్రాల్లో కొన్నసాగుతున్న వర్షాలు.. రాగల 3 రోజులు భారీ వానలు

Show comments