MLC Kavitha: కవిత సీబీఐ లిక్కర్ కేసు.. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..
- కవిత సీబీఐ లిక్కర్ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..
- ఇవాళ కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచనున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: కవిత సీబీఐ లిక్కర్ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారించనుంది. కవితపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే పరిగణలోకి తీసుకుంది. ఇవాళ కవితను తీహార్ జైల్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచనున్నారు. కవితపై చార్జిషీటులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పాలసీ రూపకల్పనలో ప్రధాన సూత్రధారి కవిత అని సీబీఐ పేర్కొంది. మద్యం వ్యాపారులకు అనుకూలంగా మద్యం పాలసీ తయారీ… అందుకు సౌత్ గ్రూప్ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందాయి. రూ. 100 కోట్ల విరాళాలు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంలో కవిత సూత్రధారి అని సీబీఐ చెబుతోంది. కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్ పల్లి, అరుణ్ పిళ్లై, అశోక్ కౌశిక్ పనిచేశారని సీబీఐ చెబుతోంది. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కోసం కవితకు మాగుంట రాఘవ, వెనక శరత్‌రెడ్డి డబ్బులు సమకూర్చినట్లు సమాచారం.
Read also: Dilsukh Nagar Bomb Blasts: దిల్ సుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి..
Also Read
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
కవిత సహకారంతో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి మద్యం వ్యాపారంలో చిల్లర జోన్లు సంపాదించారని, ఇందుకోసం కవితకు డబ్బులు ఇచ్చారని సీబీఐ చెబుతోంది. మద్యం వ్యాపారం పేరుతో వసూలు చేసిన సొమ్మును హవాలా ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు సీబీఐ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవితను దర్యాప్తు సంస్థ ఏప్రిల్ 11న అరెస్టు చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం ఏప్రిల్ 15 నుంచి జుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు.కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. జూలై 1న ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలకు ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కస్టడీని ఆగస్టు 31 వరకు పొడిగించిన జస్టిస్ కావేరీ బవేజా గురువారం సీబీఐ దాఖలు చేసిన అవినీతి కేసులో ఆగస్టు 8 వరకు పొడిగించారు.
Rains Updates: తెలుగు రాష్ట్రాల్లో కొన్నసాగుతున్న వర్షాలు.. రాగల 3 రోజులు భారీ వానలు
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!