NTV Telugu Site icon

Siddaramaiah: 2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు..

Siddaramaiah

Siddaramaiah

Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతోంది. 139 స్థానాల్లో ఇప్పటికే లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలని ఆశిస్తున్నట్లు సిద్దరామయ్య అన్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ గాంధీ 2024లో ప్రధాని అవుతారని కాంగ్రెస్ అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: Revanth Reddy: బీఆర్‌ఎస్‌ 25, ఎంఐఎం 7, బీజేపీ 9 లోపే.. మిగిలిన సీట్లు కాంగ్రెస్ వే

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన ఆదేశమని అభివర్ణించారు సిద్ధరామయ్య. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు ఇది గీటురాయిగా నిలుస్తుందని అన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించేలా చూస్తామని, రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇది నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు వ్యతిరేకంగా వచ్చిన ఆదేశం అని, ప్రధాని 20 సార్లు కర్ణాటకకు వచ్చారని, గతంలో ఏ ప్రధాని కూడా ఇలా ప్రచారం చేయలేదని సిద్ధరామయ్య అన్నారు.

130 సీట్లు కూడా దాటుతాం, ఇది కాంగ్రెస్ పార్టీ ఘన విజయం, బీజేపీ ప్రభుత్వంతో విసిగిపోయిన కర్ణాటక ప్రజలు మార్పును కోరుకున్నారని,ఆపరేషన్ ‘కమలానికి’ బీజేపీ భారీగానే ఖర్చు చేసిందని సిద్ధరామయ్య అన్నారు. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందని ఆయన అన్నారు. ‘‘ఇది లౌకిక పార్టీ సాధించిన విజయం, కర్ణాటక ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ కు ఈ ఫలితాలు అందించారు.’’ అని ఆయన ట్వీట్ చేశారు. 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 139 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 62 స్థానాల్లో ,జేడీయూ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Show comments