NTV Telugu Site icon

Jairam Ramesh: కర్ణాటకకు విటమిన్-పి కావాలి..

Jai Ram Ramesh

Jai Ram Ramesh

Jairam Ramesh: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని నరేంద్రమోడీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది, కానీ కాంగ్రెస్ మాత్రం స్థానికతకు పెద్ద పీట వేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ అన్నారు. నాలుగు ఏళ్ల బీజేపీ పాలన తర్వాత కర్ణాటక ప్రజలకు విటమిన్-పి కావాలని ఆయన అన్నారు. విటమిన్-పి అంటే కాంగ్రెస్ ఫెర్ఫామెన్స్( కాంగ్రెస్ పనితీరు) అని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ, బీజేపీ సీనియర్ నేతలు ‘కార్పెట్ బాంబింగ్’ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని, దీనిపై కాంగ్రెస్ ఆందోళన చెందడం లేదని, వాటిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వద్ద ‘‘యాంటి ఎయిర్ క్రాఫ్ గన్’’లు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.

Read Also: Kodali Nani: చంద్రబాబు, రజనీకాంత్‌లకు భవిష్యత్తు లేదు

బీజేపీ ప్రచారం చూస్తుంటే నిరాశను సూచిస్తోందని, కర్ణాటక ఎన్నికలు బీజేపీ బెదిరింపులు, కాంగ్రెస్ హామీలకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని, ఆపరేషన్ కమలం పూర్తిగా అనవసరమని ఆయన పేర్కొన్నాడు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ సిఎం పదవి కోసం ఆదిపత్య పోరు నడుస్తుందనే ప్రశ్నకు సమాధానం.. జై రాం రమేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో తక్కువగా ఉందని, బీజేపీతో పోలిస్తే ఇది కాంగ్రెస్ లో అసమ్మతి తక్కువే అని ఆయన అన్నారు. బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజిన్ నినాదం బూటకమని విమర్శించారు.

మే 10న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోండగా.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, కింగ్ కాకున్నా కనీసం కింగ్ మేకర్ పాత్ర పోషించాలనే ఉద్దేశంలో జేడీఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.