Neha Murder Case: “నా కొడుకు చేసింది తప్పే”.. క్షమాపణలు కోరిన నిందితుడు ఫయాజ్ తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neha Murder Case: కర్ణాటక హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హిమరేత్‌ని అత్యంత దారుణంగా పొడిచి చంపడం ఆ రాష్ట్రంలో రాజకీయంగా వివాదాస్పదమైంది. హుబ్బళ్లిలో ఓ కాలేజీలో ఏంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నేహ(23)ని ఆమె సీనియర్ విద్యార్థి ఫయాజ్ హత్య చేశాడు. ఈ ఘటన కాలేజ్ క్యాంపస్‌లో జరిగింది. ఈ హత్యకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ హత్య కేసులో నిందితడు ఫయాజ్‌ని అరెస్ట్ చేశారు. కత్తిపోట్ల కారణంగానే బాధితురాలు చనిపోయిందని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనలో ‘‘లవ్ జిహాద్’’ కోణం ఉందని బీజేపీ ఆరోపించింది. చివరకు ఆమె తండ్రి కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా నిరంజన్ హిరేమత్ కూడా.. తన కూతురును ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేశారని, అందుకు లొంగకపోవడంతోనే హత్య జరిగిందని ఆరోపించారు. అయితే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం ఇది వ్యక్తిగత వివాదమని, ఇందులో లవ్ జిహాద్ కోణం లేదని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, నిందితుడు ఫయాజ్ తల్లి ముంతాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నా కొడుకు తరుపున నేను కర్ణాటక ప్రజలందరికీ క్షమించమని కోరుతున్నాను. నేను అమ్మాయి తల్లిదండ్రుల్ని కూడా క్షమించాలని కోరుతున్నాను. ఆమె నా కూతురు లాంటిది. నేను ఇక్కడ ఎలాంటి భేదం చూపడం లేదు. వారు ఎలా బాధపడుతున్నారో నాకు తెలుసు. నేను కూడా అంతే బాధతో ఉన్నానను. నా కొడుకు చేసింది తప్పే. అతను నా కొడుకైనా తప్పు తప్పే’’ అని అన్నారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Read Also: Shahid Afridi: “ఇది పొరుగువారి హక్కు”.. రోహిత్ శర్మ వ్యాఖ్యలపై అఫ్రిది రెస్పాన్స్..
తన కొడుకు చేసిన పనికి దేశ చట్టం ప్రకారం శిక్షించాల్సిందే అని ముంతాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే, తన కొడుకు, బాధితురాలు నేహ ప్రేమించుకున్నారని, ఈ విషయం నాకు గతేడాది కాలంగా తెలుసని చెప్పారు. అయితే, ఫయాజ్ తన కుమార్తెకు స్నేహితుడు మాత్రమే అని, నిందితుడితో ఎలాంటి రిలేషన్ లేదని అన్నారు. అయితే, అతను చేసిన ప్రపోజల్స్‌ని నేహ ప్రతీసారి తిరస్కరించదని చెప్పారు. ఇలాగే చేస్తే తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినట్లు నేహా తండ్రి వెల్లడించారు.
ఈ కేసులో లవ్ జిహాద్ కోణం ఉందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అయితే ఈ ఆరోపణల్ని కర్ణాటక ప్రభుత్వం తోసిపుచ్చింది. నేహా, ఫయాజ్ మధ్య రిలేషన్‌షిప్ ఉందని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర అన్నారు. నేహా హత్యపై బీజేపీ, రైట్ వింగ్ కార్యకర్తలు హుబ్బళ్లిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ ఆరోపించింది. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలను సాకుగా చూపి బీజేపీ రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోందని కాంగ్రెస్ ప్రతి ఆరోపణలు చేసింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!