Minister Shivanand Patil: రైతులపై మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు.. ‘పరిహారం కోసమే ఆత్మహత్యలు..!’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక మంత్రి శివనంద్ పాటిల్ రైతులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ చేసిన ఆయన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. రైతుల ఆత్మహత్యలను అవహేళన చేసిన మంత్రిపై ప్రజలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో ఆయనను కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న శివానంద్ పాటిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచినప్పటి నుంచి రైతుల ఆత్మహత్యల సంఖ్య కూడా పెరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Delhi Tour: రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అంతేకాదు ‘ఇప్పడు రైతులంతా కరువు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అలా కరవు వస్తే, తాము తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయనేది వారి ఆశ. రైతులకు నీళ్ళు ఉచితం. కరెంటు ఉచితం. విత్తనాలు, ఎరువులు ఉచితం. కాబట్టి తమ రుణాలు రద్దు కావాలంటే ప్రతి ఏటా కరవు రావాలని రైతులు కోరుకుంటున్నారు’ అంటూ మాట్లాడుకొచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై రైతు సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ప్రకటన చేసిన మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం అధికారి మల్లికార్జున్ బళ్లారి డిమాండ్ చేశారు. ‘‘మీ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇస్తే ఆత్మహత్య చేసుకుంటావా?’’ అంటూ ధ్వజమెత్తారు.
Also Read: Uddhav Thackeray: ఈ సారి ఆ తప్పు చేస్తే దేశంలో నియంతృత్వమే.. ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు..
ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి తప్పించాలని రైతు సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు సిద్దరామయ్య ప్రభుత్వం రైతులను అవమానించేవిధంగా వ్యవహరిస్తోందని బిజేపీ ధ్వజమెత్తింది. సిద్దరామయ్య మంత్రివర్గంలో మూర్ఖులే ఎక్కువమంది ఉన్నారంటూ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో తనపై వస్తోన్న వ్యతిరేకతపై మంత్రి స్పందించారు. ఈ మేరకు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. రైతుల మనోభావాలను దెబ్బతీయాలని తాను అనుకోలేదని, అయితే రైతుల ఆత్మహత్యలపై నివేదించే ముందు ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం వేచి ఉండాలని, మరింత బాధ్యతగా వ్యవహరించాలని మీడియా ప్రజలకు తాను సలహా ఇస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!