Karnataka Hijab Ban: హిజాబ్ వివాదంపై రేపు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Order Likely Tomorrow on Karnataka Hijab Ban:కర్ణాటకలో ప్రభుత్వ హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడాన్ని నిషేధించింది. ప్రభుత్వ ఉత్తర్వులపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిగా.. హిజాబ్ అనేది ఇస్లాంలో తప్పనిసరి ఆచారం కాదని, హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడాన్ని నిషేధించింది. అయితే ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఇదిలా ఉంటే హిజాబ్ బ్యాన్ పై సుప్రీంకోర్టు రేపు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించి కర్ణాటక హైకోర్టు తీర్పుపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం 10 రోజుల పాటు విచారించింది. సెప్టెంబర్ 22న తీర్పును రిజర్వ్ లో ఉంచింది. కాగా.. ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ హేమంత్ గుప్తా ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఈ వారంలోనే ఈ పిటిషన్లపై తీర్పు వెలువడే అవకాశం ఉంది.
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
- Rahul Gandhi-Om Birla: లోక్‌సభ స్పీకర్‌తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్‌లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..
Read Also: VRA Strike: ప్రభుత్వంతో విఆర్ఏల చర్చలు సఫలం.. రేపట్నుంచి విధుల్లోకి!
సుప్రీంకోర్టులో హిజాబ్ కు మద్దతుగా పిటిషనర్ల తరుపున న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ముస్లిం బాలికలు హిజాబ్ లేకుండా పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని.. దీంతో వారి చదువులకు ఆటంకం ఏర్పడుతుందని.. చాలా మంది పాఠశాలకు వెళ్లడమే మానేశారని సుప్రీంకోర్టుకు విన్నవించారు. పాఠశాలలో, కళాశాల్లలో సమానత్వం, సమగ్రతకు భంగం కలిగించే దుస్తులను నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఫిబ్రవరి 5, 2022 నాటి ఉత్తర్వులోని అంశాలను సుప్రీంకోర్టుకు వివరించారు ప్రభుత్వం తరుపున న్యాయవాదులు.
ఈ కేసును ముందుగా రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని సమర్థిస్తూ కొందరు వ్యక్తులు ఆందోళనలు చేయడం ఓ పథకంలో భాగమని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. మార్చి 15న కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వం ప్రీ యూనివర్సిటీ గర్ల్స్ కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థలు తరగతి గదులలో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ఈ హిజాబ్ వివాదం ఉడిపి నుంచి కర్ణాటకలోని చిక్ మంగళూర్, మాండ్యా, బాగల్ కోట్, దక్షిణ కన్నడ జిల్లా, బెంగళూర్, తుముకూరు, చిక్ బల్లాపూర్, శివమొగ్గ జిల్లాలకు కూడా వ్యాపించింది.
తాజావార్తలు
-
Vishwak Sen: మాస్ కా దాస్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఆ డైరెక్టర్‌తో విశ్వక్ మూవీ!
-
India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
-
NTR : బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
-
Rahul Gandhi-Om Birla: లోక్‌సభ స్పీకర్‌తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!