కాంగ్రెస్‌కు మరో షాక్.. పార్టీకి మరో కేంద్ర మాజీ మంత్రి గుడ్‌బై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులున్నాయి.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే కాదు.. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం.. కాంగ్రెస్‌ను వీడారు.. ఇక, కాంగ్రెస్ పార్టీతో తన సంబంధాలు ముగిశాయని ప్రకటించారు.. అయితే, ఏ పార్టీలో చేరే విషయంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.. ప్రస్తుతం తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. తాను స్వతంత్రుడనని చెప్పుకొచ్చారు..
కర్ణాటక మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా పేరున్నసీఎం ఇబ్రహీం.. కాంగ్రెస్ పార్టీని వీడుతారంటూ గత ఏడాది కాలంగా పుకార్లు షికార్లు చేస్తూ వచ్చాయి.. కానీ, విధానపరిషత్‌లో ప్రతిపక్షనేత హోదా ఖాళీ కావడంతో ఆ స్థానానికి తీవ్ర ప్రయత్నం చేశారాయన.. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం ఆ స్థానాన్ని సీనియర్ నేత బీకే హరిప్రసాద్‌కు అప్పగించేందుకు సిద్ధమైంది.. ఈ మేరకు బుధవారం ఆయన పేరును ఖరారు చేసింది. కానీ, ఆ వెంటనే ఇబ్రహీం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇబ్రహీం.. తనపై సోనియాగాంధీకి అభిమానం తగ్గిందని, అటువంటి చోట కొనసాగినా ప్రయోజనం ఉండబోదని చెప్పుకొచ్చారు.. ఇక, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు బీకే హరిప్రసాద్ పట్ల అభిమానం ఉందని, వారిద్దరిదీ ఒకే మాట అంటూ విమర్శలు గుప్పించారు.. తమనకో మరోసారి అవమానం జరిగింది.. ఇక, తాను కాంగ్రెస్‌లో ఉండేది లేదని తేల్చేశారు.. అయితే.. ఇబ్రహీం.. జేడీఎస్ లో చేరే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.
Also Read
- Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
తాజావార్తలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!