కర్ణాటక అసెంబ్లీలో డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతాలాపన చేయడంం తీవ్ర దుమారం రేపింది. ఆయన పాడుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించారు. దీంతో డీకే.శివకుమార్ వేరే కుంపటి పెట్టబోతున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. అంతేకాకుండా సిద్ధరామయ్య – డీకే.శివకుమార్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శివకుమార్ కారణంగానే సిద్ధరామయ్య వర్గానికి చెందిన మంత్రి ఉద్వాసనకు గురి కావల్సి వచ్చిందని గుర్రుగా ఉన్నారు. ఇలా రెండు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: అన్నామలైకు ఓ మంత్రి కుమారుడు షాక్.. స్టేజ్‌పై ఎంత పని చేశాడంటే..!
అయితే ఆర్ఎస్ఎస్ గీతాలాపన వివాదం ముదురుతుండడంతో తాజాగా డీకే.శివకుమార్ స్పందించారు. గాంధీ కుటుంబమే తనకు దేవుడు అని చెప్పుకొచ్చారు. ఈ వివాదంపై క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆర్ఎస్ఎస్ గీతం పఠనంపై ఎవరినైనా బాధపెడితే క్షమాపణలు చెబుతానని.. కానీ రాజకీయంగా చూడ్డాం భావ్యం కాదన్నారు. గాంధీ కుటుంబం పట్ల తన జీవితాంతం విధేయత, నిబద్ధత ఉంటుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: BJP: బీహార్ ఎన్నికల ముందే బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎంపిక.. కసరత్తు ప్రారంభం!
ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోకను విమర్శించడానికి తాను ఆర్ఎస్ఎస్ గీతాన్ని పఠించానని.. అంతేకాని ఆ సంస్థను ప్రశంసించడానికి కాదని శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే కావడానికి ముందు 47 ఏళ్ల వయసులో తాను రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశానని… కాంగ్రెస్, గాంధీ కుటుంబం, ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనతాదళ్ (లౌకిక), కమ్యూనిస్టులు, ఇతర రాజకీయ పార్టీల చరిత్రను అధ్యయనం చేసినట్లు వివరించారు. రాజకీయ లాభం కోసం తన మాటలను దుమారం రేపుతున్నారని తప్పుపట్టారు.
గాంధీ కుటుంబాన్ని ఎవరూ ప్రశ్నించలేరని.. తాను పుట్టుకతోనే కాంగ్రెస్ సభ్యుడ్ని అన్నారు. కాంగ్రెస్ సభ్యుడిగానే చనిపోతానని ప్రకటించారు. తనను సమర్థించిన, విమర్శించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత, నిబద్ధతతో మనమందరం కలిసి పనిచేద్దామని సహచర నేతలకు పిలుపునిచ్చారు.