Karanataka BJP Youth Leader killed case: కర్ణాటకలో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య ప్రకంపనలు కలిగిస్తోంది. ఈ హత్యపై కర్ణాటకలోని బీజేపీ గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే సీఎం బస్వరాజ్ బొమ్మై ఈ హత్య నేపథ్యంలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రవీణ్ నెట్టార్ హత్యతో బొమ్మై సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తియిన సందర్భంగా జనోత్సవ వేడుకలను రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. బీఎస్ యడియూరప్ప, నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ల పూర్తి చేసుకుంది.. కానీ ప్రవీణ్ నెట్టారు హత్యతో ఆయన తల్లి, కుటుంబ సభ్యుల బాధను చూసి కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు బొమ్మై వెల్లడించారు. శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య జరిగిన కొన్ని రోజులకే ప్రవీణ్ నెట్టారు హత్య జరగడం నన్ను తీవ్రంగా బాధించిందని బొమై అన్నారు.
రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వింగ్ తో పాటు కమాండోల టాస్క్ ఫోర్స్ కు శిక్షణ ఇస్తామని.. ఇలాంటి హత్యలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని ఆయన అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి.. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్న దేశ వ్యతిరేక, టెర్రర్ గ్రూపులకు అడ్డుకట్ట వేసేందుకు కొత్తగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అయితే తాజాగా జరిగిన బీజేపీ కార్యకర్త హత్యలో అంతర్ రాష్ట్ర సమస్యలు కూడా ఉన్నాయని.. ఇప్పుడే వాటిని బయటపెట్టలేమని బస్వరాజ్ బొమ్మై అన్నారు. పీఎఫ్ఐ వంటి ఉగ్రవాద సంస్థ, వ్యక్తులను నిర్మూలించేందుకు ప్రత్యేక దళాన్ని రూపొందిస్తున్నామని అన్నారు.
Read Also: Central Government Jobs: 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి వచ్చాయంటే..
కర్ణాటకలో కాంగ్రెస్ హయాంలో మొత్తం 22 మంది యువకుల హత్యలు జరిగాయని.. వీటిపై అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. దీనికి బదులుగా ఈ ఘటనల వెనక ఉన్న సంస్థలపై 200 కేసులు ఉపసంహరించుకుందని.. దీంతో వారంతా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ యువ మోర్చా నేత ప్రవీణ్ నెట్టారును ఇంటికెళ్తున్న క్రమంలో దుండగులు వెంబడించి దారుణంగా చంపారు. ఈ ఘటనపై రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.