Kamal Haasan: ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు.. తొలి స్పీచ్‌లో కమల్‌హాసన్ వార్నింగ్
- తొలి స్పీచ్‌లో అదరగొట్టిన కమల్ హాసన్
- ఈసీ, కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజం
- ఏ ప్రభుత్వం శాశ్వతం కాదంటూ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరికీ అధికారం శాశ్వతం కాదని.. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం శాశ్వతంగా లేదని మక్కల్ నీది మయ్యం అధినేత, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా తొలిసారి కమల్ హాసన్ రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్.. వస్తున్నాయ్’’ అంటూ తెలుగు భాషతో స్పీచ్ మొదలు పెట్టారు. ఏం మాట్లాడుతున్నానో తెలుగు వారికి అర్థమవుతుందన్నారు.
ఇది కూడా చదవండి: Bill Gates: నేను చింతిస్తున్నా.. క్షమించండి.. ఎప్స్టీన్ ఫైల్‌పై బిల్ గేట్స్ పశ్చాత్తాపం
Also Read
- PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
- Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాను తీవ్రంగా విమర్శించారు. తమిళనాడులో దాదాపు కోటి మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని.. వారంతా బతికినంత కాలం చనిపోయే ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీహార్‌ను ఉదాహరణగా చూపిస్తూ ఎన్నికల కమిషన్ జీవిస్తున్నవారిని కూడా చనిపోయినట్లుగా పేర్కొంటుందని గుర్తుచేశారు. ఇదొక కొత్త రకమైన వ్యాధిగా అభివర్ణించారు. ఈ వ్యాధి దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందకూడదన్నారు. ఎన్నికల కమిషన్ అయితే ఈ వ్యాధి వ్యాప్తి చేయడానికి పూనుకుందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ మా ఓటు హక్కును తనిఖీ చేస్తోందని.. స్పెల్లింగ్‌లు, చిరునామాలు తనిఖీ చేస్తున్నారన్నారు. అక్రమ ఎన్నికల ద్వారా విజయం సాధించాలని చూస్తున్నారని విమర్శించారు. అయినా ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని.. ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Ghaziabad Case: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీ ఏంటంటే..!
త్వరలో దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ‘సర్’ నిర్వహించింది. డిసెంబర్లో ముసాయిదా విడుదల చేసినప్పుడు తమిళనాడులో 97 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లుగా ప్రకటించింది. వారంతా చనిపోయారని/ బదిలీ చేయబడ్డారని పేర్కొంది. అనంతరం 1.90 కోట్ల మంది ఓటర్లుగా ఉన్నట్లు తెలిపింది. తుది జాబితా ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ రానుంది.
తాజావార్తలు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
-
Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!