Kaali Poster: కాళీ పోస్టర్‌పై వివాదం.. నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకురాలు లీనా మణిమేఖలై వివాదంలో చిక్కుకున్నారు. ‘కాళీ’ పేరుతో తీసిన ఓ డాక్యుమెంటరీకి సంబంధించిన పోస్టర్‌ను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే హిందూ దేవతను కించపరిచేలా ఆ పోస్టర్ ఉండడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. కెనడాలోని ఆగాఖాన్ మ్యూజియంలో ఈ పోస్టర్‌ను ప్రదర్శించారు. కాళీ మాతగా నటించిన పాత్రధారి సిగరెట్ తాగుతూ, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్(ఎల్జీబీటీ)ని సూచించే ఏడు రంగుల జెండాను ప్రదర్శిస్తూ పోస్టర్లో కనిపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఢిల్లీలో న్యాయవాది వినీత్ జిందాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై స్పందించిన లీనా మణిమేఖలై మాత్రం తాను బతికున్నంతవరకు నిర్భయంగా గొంతు వినిపిస్తూనే ఉంటానని అన్నారు. అందుకు జీవితాన్ని మూల్యంగా చెల్లించాల్సి వచ్చినా సిద్ధంగా ఉంటానన్నారు. డాక్యుమెంటరీ చూస్తే పోస్టర్ వెనుక ఉన్న ఉద్దేశం అర్థమవుతుందని ఆమె అన్నారు. గతంలో లీనా మణిమేఖలై నటించిన ‘మాదతి’, ‘ఎర్రసముద్రం’ వంటి సినిమాలు ఎంతో మందిని ఆకర్షించాయి. అంతర్జాతీయంగా ఎన్నో చలనచిత్రోత్సవాల్లో కూడా లీనా చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. ఆమె ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.
Also Read
- Jaipur Tension Over School Row: జైపూర్‌లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
Bengaluru Crime: యువతిని వేధించిన దుండగుడు.. కాపాడిన హిజ్రాలు
తమిళనాడు మధురైకి చెందిన లీలా మణిమేకలై.. ‘రిథమ్స్ ఆఫ్ కెనడా’లో భాగంగా ‘కాళీ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కెనడాలోని టొరంటోలో ఉన్న అగాఖాన్ మ్యూజియంలో విడుదల చేశారు. అయితే, ఆ పోస్టర్ దేవతా మూర్తిని కించపరిచేలా ఉండడంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ‘ArrestLeenaManimekalai’ హ్యాష్‌ట్యాగ్ పేరుతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది.
Super thrilled to share the launch of my recent film – today at @AgaKhanMuseum as part of its “Rhythms of Canada”
Link: https://t.co/RAQimMt7LnI made this performance doc as a cohort of https://t.co/D5ywx1Y7Wu@YorkuAMPD @TorontoMet @YorkUFGS
Feeling pumped with my CREW❤️ pic.twitter.com/L8LDDnctC9
— Leena Manimekalai (@LeenaManimekali) July 2, 2022
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!