NTV Telugu Site icon

Supreme court: సుప్రీంకు ఇద్దరు కొత్త జడ్జీలు.. తొలిసారి మణిపూర్ నుంచి నియామకం

Supremecourt

Supremecourt

దేశ సర్వోన్నత న్యాయస్థానానికి కొత్తగా ఇద్దరు జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నియామకాలను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహదేవన్‌ను కేంద్రం నియమించింది. దీంతో ఇప్పుడు సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో సహా 34 మంది అయ్యారు. ఈ ఇద్దరు న్యాయమూర్తులు పదోన్నతిని సుప్రీంకోర్టు కొలీజియం గతంలో సిఫారసు చేసింది.

ఇది కూడా చదవండి: SIIMA 2024: సైమా 2024.. దసరా vs హాయ్ నాన్న.. నానితో నానికే పోటీ!

జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన మొదటి న్యాయమూర్తిగా నిలిచారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ మొదటి అడ్వకేట్ జనరల్ ఎన్ ఇబోటోంబి సింగ్ కుమారుడు. ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజ్ మరియు క్యాంపస్ లా సెంటర్‌లో పూర్వ విద్యార్థి. 1986లో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. న్యాయమూర్తి కాకముందు మణిపూర్ అడ్వకేట్ జనరల్‌గా కూడా పనిచేశారు. అనంతరం గౌహతి హైకోర్టు మరియు మణిపూర్ హైకోర్టులలో పనిచేశారు.

ఇది కూడా చదవండి: Crime News: యువతిని కిడ్నాప్ చేసి వేళ్లు, గొంతు కోసి హత్య..

ఇక జస్టిస్ మహదేవన్ ప్రస్తుతం మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. చెన్నైలో జన్మించిన జస్టిస్ మహదేవన్ మద్రాసు న్యాయ కళాశాల పూర్వ విద్యార్థి. న్యాయవాదిగా 9,000 కేసులకు పైగా డీల్ చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి అదనపు గవర్నమెంట్ ప్లీడర్ (పన్నులు), అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ మరియు మద్రాసు హైకోర్టులో భారత ప్రభుత్వానికి సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.