Sourav Ganguly: సుప్రీంకోర్టు త్వరగా తీర్పు ఇవ్వాలని దాదా విజ్ఞప్తి..
- ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన కేసులో సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా తీర్పునివ్వాలి..
- ఇలాంటి దారుణాలకు పాల్పడాలనే ఆలోచన వచ్చినా వణుకుపుట్టేలా తీర్పు ఉండాలి..
- బాధితురాలికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరు న్యాయం కోసం చూస్తున్నారు: సౌరవ్ గంగూలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sourav Ganguly: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశాన్ని కుదిపేయడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ చేస్తుంది. ఇక, కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన కేసులో సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా తీర్పునివ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరారు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు.. ఇలాంటి దారుణాలకు పాల్పడాలనే ఆలోచన వచ్చినా వణుకుపుట్టేలా తీర్పు ఉండాలని దాదా పేర్కొన్నాడు. కాగా, ఈ క్రమంలో కేసు సుప్రీంకోర్టుకు చేరగా.. ఘటనకు సంబంధించిన విచారణ చేసిన నివేదికను సెప్టెంబరు 17వ తేదీ లోగా సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ (సోమవారం) జరిగిన విచారణలో భాగంగా ఈ మేరకు గడువును న్యాయస్థానం విధించింది.
Read Also: Stree 2: స్త్రీ 2 సరికొత్త రికార్డు.. హిందీలోనే సెకండ్!!
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
అయితే, బాధితురాలికి మద్దతుగా జరిగిన ఉద్యమంలో ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నారని సౌరవ్ గంగూలీ అన్నారు. రాజకీయాలకు అతీతంగా వీధుల్లో ఆందోళన బాట పట్టారని చెప్పారు. వారందరికీ న్యాయం జరగాలి.. న్యాయస్థానం విచారణ ప్రక్రియకు సమయం పడుతుందనే విషయం తెలుసు.. కానీ, వీలైనంత సత్వరంగా తీర్పును ఇవ్వాలని అభ్యర్థించారు.. ప్రపంచం మొత్తానికి ఈ తీర్పు ఆదర్శంగా ఉండాలని దాదా అన్నారు. చెడు ఆలోచనలు చేసే వారి గుండెల్లో ఈ తీర్పుతో గుబులుపుట్టేలా ఉండాలన్నారు. బాధితురాలికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరు న్యాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని గంగూలీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!