JP Nadda: మణిపూర్‌లో మైటీ, కుకీ కమ్యూనిటీల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. అందులో మణిపూర్ లో దిగజారుతున్న పరిస్థితిలో జోక్యం చేసుకోవాలని కోరారు. అక్కడ పరిస్థితి రోజురోజుకు ఎలా దిగజారుతుందో తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం.. వేల మంది నిరాశ్రయులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వహిస్తున్నాయని ఆరోపించారు. ఇక, ఖర్గే లేఖకు కౌంటర్ గా కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరో లేటర్ రాశారు.
Read Also: Harish Rao: పంటలపై రివ్యూ మర్చిపోయారు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో హరీష్ రావు..
ఇక, జేపీ నడ్డా రాసిన లేఖలో.. భారత భద్రతా వైఫల్యానికి.. దేశంలోకి విదేశీ ఉగ్రవాదుల అక్రమ వలసలకు కాంగ్రెస్ కారణమని పేర్కొన్నారు. మణిపూర్‌లో పరిస్థితిని మరింత వివాదంగా సృష్టించేందుకు మీ (కాంగ్రెస్) పార్టీ పదే పదే ఎలా ప్రయత్నిస్తుందో అందరు తెలుసని చెప్పుకొచ్చారు. విదేశీ మిలిటెంట్ల అక్రమ వలసలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధం చేయడమే కాకుండా.. కేంద్ర మాజీ హోంమంత్రిగా ఉన్న పి. చిదంబరం వారితో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి కూడా మీరు మరిచిపోయినట్లు కనిపిస్తోంది అని జేపీ నడ్డా ఆరోపించారు.
Read Also: Collide Two Boats: నావికాదళ నౌకను ఢీకొన్న ఫిషింగ్ బోట్.. ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్
అలాగే, మీ(కాంగ్రెస్) ప్రభుత్వంలో భారతదేశం యొక్క భద్రత, పరిపాలనాలో పూర్తి వైఫల్యం చెందిందని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ఇక, మణిపూర్‌లో శాంతిని నెలకొల్పితే.. దానిని ధ్వంసం చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని అనేక దశాబ్దాల వెనక్కి నెట్టడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్న ప్రధాన కారణాలలో ఒకటి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వెల్లడించారు.