Ankit Love: ప్రధాని మోడీకి క్షమాపణ.. తల్లి అంత్యక్రియల కోసం ఎమర్జెన్సీ వీసా మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ankit Love: జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (JKNPP) వ్యవస్థాపకుడు భీమ్ సింగ్ కుమారుడు అంకిత్ లవ్ ను ప్రభుత్వ బ్లాక్ లిస్టు నుంచి తొలగించింది. గతేడాది లండన్‌లో ప్రభుత్వ వ్యతిరేక చర్యల్లో పాల్గొన్నందుకు అంకిత్ ను భారత ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉంటున్న ఆయన తల్లి చనిపోయింది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఎమర్జెన్సీ వీసా కోసం ప్రధాని నరేంద్ర మోడీని క్షమాపణలు కోరతూ లేఖ రాశాడు. దీంతో ఆయనకు కేంద్ర వీసా మంజూరు చేసింది.
Read Also: Karnataka Elections: కర్ణాటకలో అధికారం ఎవరిది..? ఒపీనియన్ పోల్స్ చెబుతున్నది ఇదే..
Also Read
- El Nino-Centre: ఎల్‌నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
- CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
- Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
- Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
ప్రస్తుతం లండన్ లో ఉన్న అంకిత్ లవ్ (39) తన తల్లి జయ మాల (64) అంత్యక్రియలకు హాజరయ్యేందుకు గురువారం మూడు నెలల అత్యవసర వీసాను అందించింది. శుక్రవారం మధ్యాహ్నం ఉదంపూర్ జిల్లాలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. నా తల్లికి తుది వీడ్కోలు చెప్పేందుకు శుక్రవారం ఉదయం జమ్మూ వస్తున్నానని అంకిత్ లవ్ వెల్లడించారు. తన క్షమాపణలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నందుకు, తల్లి అంత్యక్రియలు నిర్వహించడానికి వీసా అందించింనందుకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
గతేడాది లండన్ లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నాడు అంకిత్ లవ్. హైకమిషన్ కార్యాలయంపైకి గుడ్లు, రాళ్లతో దాడి చేశాడు. దీంతో అతడిని భారత హైకమిషన్ బ్లాక్ లిస్టులో చేర్చింది. నేను ఎంతో ఇష్టపడే, గర్వపడే నా దేశానికి వ్యతిరేకంగా ఇకమీదట మరోసారి అలాంటి చర్యలకు పాల్పడనని క్షమాపణలు కోరారు. ఈ నేపథ్యంలో ఆయన క్షమాపణలు కోరడంతో వీసా మంజూరైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జయమాల ఏప్రిల్ 26న మరణించారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని జమ్మూలోని ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీలో ఉంచారు. గతేడాది మే 31న ఆయన తండ్రి భీమ్ సింగ్ మరణించారు. ఆ సమయంలో అంకిత్ లవ్ తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు.
తాజావార్తలు
-
El Nino-Centre: ఎల్‌నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
-
Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
-
Oats Roti Recipe: గోధుమ రోటీ బోర్ కొట్టిందా..? ఓట్స్ రోటీ ట్రై చేయండి.. ఆరోగ్యానికి మేలు, రుచిలోనూ సూపర్!
-
Iran Military Power: అమెరికానే వణికించేలా ఇరాన్ మిలిటరీ పవర్.. 2,100 క్షిపణులు, వేలాది డ్రోన్లతో యుద్ధానికి సై!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!